Xiaomi Air Fryer 6L: ఎక్కువ కెపాసిటీతో కొత్త ఎయిర్ ఫ్రైయర్ లాంచ్ చేసిన షియోమీ.!

Xiaomi Air Fryer 6L: ఎక్కువ కెపాసిటీతో కొత్త ఎయిర్ ఫ్రైయర్ లాంచ్ చేసిన షియోమీ.!
HIGHLIGHTS

షియోమీ ఈరోజు ఎక్కువ కెపాసిటీతో కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను లాంచ్ చేసింది

Xiaomi Air Fryer 6L పేరుతో ఈ కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను ఈరోజు విడుదల చేసింది

Xiaomi 14 CIVI స్మార్ట్ ఫోన్ తో పాటు ఈ కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను కూడా విడుదల చేసింది

షియోమీ ఈరోజు ఎక్కువ కెపాసిటీతో కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను లాంచ్ చేసింది. Xiaomi Air Fryer 6L పేరుతో ఈ కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను ఈరోజు విడుదల చేసింది. ఈరోజు విడుదల చేసిన Xiaomi 14 CIVI స్మార్ట్ ఫోన్ తో పాటు ఈ కొత్త ఎయిర్ ఫ్రైయర్ ను కూడా విడుదల చేసింది. ఈ ఎయిర్ ఫ్రైయర్ ను 1500W పవర్ మరియు 360° ఈవెన్ కుకింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించినట్లు షియోమీ తెలిపింది.

Xiaomi Air Fryer 6L: ప్రైస్ & ఆఫర్స్

షియోమీ ఎయిర్ ఫ్రైయర్ 6L ను రూ. 6,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో భారత మార్కెట్ లో విడుదల చేసింది. అయితే, ఈ ఎయిర్ ఫ్రైయర్ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది. ఈ షియోమీ ఎయిర్ ఫ్రైయర్ ను ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Xiaomi Air Fryer 6L
Xiaomi Air Fryer 6L

ఈ ఆఫర్ ద్వారా ఈ ఎయిర్ ఫ్రైయర్ ను రూ. 5,999 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఎయిర్ ఫ్రైయర్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ Flipkart, Amazon, mi.com మరియు షియోమీ రిటైల్ నుండి లభిస్తుంది.

Xiaomi Air Fryer 6L: ఫీచర్లు

షియోమీ ఎయిర్ ఫ్రైయర్ 6L, కేవలం 5 కేజీల బరువుతో ఉంటుంది మరియు సులభంగా క్లీన్ చేసే సౌకర్యంతో వస్తుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ 6 ప్రీ సెట్ క్విక్ రెసిపీ మరియు 6L / 3L అడ్జెస్టబుల్ కెపాసిటీతో వస్తుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ 1500 W పవర్ తో క్విక్ హీటింగ్ అందిస్తుంది మరియు డబుల్ లేయర్ నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ ని ఈజీగా ఉపయోగించేలా టచ్ కంట్రోల్స్ ను కూడా కలిగివుంది.

Also Read: Xiaomi 14 CIVI: అద్భుతమైన కెమెరా ఫీచర్లతో విడుదలయ్యింది.. ధర ఎంతంటే.!

ఈ షియోమీ ఎయిర్ ఫ్రైయర్ గ్రిల్, ఫ్రై, బేకింగ్, టోస్ట్, రోస్ట్, ఢీ ఫ్రోస్ట్ మరియు రీహీట్ వంటి మల్టీ కుకింగ్ ఆప్షన్ లను అందిస్తుంది. ఈ షియోమీ ఎయిర్ ఫ్రైయర్ 360°సరిసమానమైన కుకింగ్ ని అందిస్తుంది. మరి ముఖ్యంగా ఇందులో చేసే వంటలు ఎగరవేసే పని లేకుండా అన్ని పదార్ధాలు సరిసమానంగా ఉడుకుతాయని షియోమీ నొక్కి చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo