ఆపిల్ మ్యూజిక్ పేరుతో కొత్త సర్విస్ ను లాంచ్ చేసిన ఆపిల్

Updated on 09-Jun-2015
HIGHLIGHTS

త్వరలో ఆండ్రాయిడ్ కు కూడా రానుంది.

ఆపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్, 2015 లో ఆపిల్ మ్యూజిక్ సర్విస్ ను ప్రారంభించింది. జూన్ 30 న దాదాపు 100 దేశాలలో ఇది వాడుకలోకి తేవనుంది ఆపిల్. ఐ os 8.4 పై పనిచేసే ఐ ఫోన్, ఐ ప్యాడ్ లకు మరియు PC లకు ఇది అందనుంది. అయితే ఆపిల్ మ్యూజిక్ సర్వీస్ కొన్ని రోజుల తరువాత ఆండ్రాయిడ్ కి కూడా రానుంది అని తెలిపారు ఆపిల్ డెవలపర్స్ బృందం. ఆపిల్ మ్యూజిక్ సర్విస్ లాంచ్ గురించి ఆపిల్ 2014 లో బీట్స్ మ్యూజిక్ ను కొన్నప్పుడే హింట్ ఇచ్చింది.

దీని ఉపయోగాలు:
1. మొదటిగా చెప్పుకోవలిసినది కనెక్ట్ ఫీచర్ ద్వారా పాటను రచించిన వారు స్వయంగా ఆ పాట లిరిక్స్, బ్యాక్ స్టేజ్ ఫోటోస్, వీడియోస్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ లేదా ఇతరలు వాళ్ళ పాటలను స్వయంగా ఆపిల్ మ్యూజిక్ నుండే విడుదల చేయవచ్చు బయట ప్రపంచానికి. వాటికి అభిమానులు, ఫాలోవర్స్ కామెంట్స్ మరియు లైక్స్ చేయగలరు. ఇది అంతా మ్యూజిక్ సిస్టం ను పూర్తిగా మార్చివేసే సరిక్రొత్త ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. 

2. బీట్స్ 1 అనే ఫీచర్ తో రీ డిజైనింగ్ చేసిన రేడియో స్టేషన్ 100 దేశాలలో పనిచేస్తుంది, ఈ రేడియో లో ఇంటర్వ్యూస్ ప్రపంచ మ్యూజిక్ వరల్డ్ లోని బెస్ట్ ఈవెంట్స్ అలాగే రేడియో DJ ల ఫేమస్ వరల్డ్ షోస్ ను మీరు పొందుతారు.

3.ఆపిల్ మ్యూజిక్ ద్వారా 30 మిలియన్ల సాంగ్స్ ను వినగలరు, పాటలను వెతికతానికి సిరి ని ఉపయోగించుకునే సదుపాయం. అయితే ఆపిల్ కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ స్పాటిఫై లాంటి వాటికి గట్టి పోటీ ఇవనుంది. 

ఇప్పుడు మీకు అంతగా నచ్చని విషయం:
ఆపిల్ సరికొత్త మ్యూజిక్ సర్వీస్ ముందుగా ఒక నెల ఫ్రీ గా దొరుకుతుంది. ఆ తరువాత నెలకు దాదాపు 630 రూ. చార్జ్ చేయనుంది ఆపిల్. అలాగే ఫేమిలీ ప్లాన్ తో 6 ఫేమిలీ సభ్యులు వరకూ ఆపిల్ స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్ ను వాడుకోవటానికి 950 రూ లను చార్జ్ చేస్తుంది.

బాటమ్ లైన్: అయితే ఆపిల్ ఏమి లాంచ్ చేసినా హైప్ ఉంటుంది. అలాగే ఇది కూడా అని అనుకోడానికి లేదు, ఎందుకంటే స్వయంగా ఆపిల్ ఫోన్ నుండే విడియోలను, ఆల్బమ్లను, లిరిక్స్ ను విడుదల చేసే ఫీచర్ నిజంగా కొత్త ఇన్నోవేషన్ అని చెప్పవచ్చు. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. పాటల రిలీజ్ ఫంక్షన్లకు డబ్బులు ఏమీ ఖర్చు చేయకుండా, ఆడియో సాంగ్స్ థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో పైరేసీ గా విడుదల అవ్వకుండా సొంత సినిమా వాళ్లే ఆన్ లైన్ లో రిలీజ్ చేయవచ్చు. ఇక పొతే లైవ్ రేడియో స్ట్రీమింగ్, exclusive ఇంటర్వ్యూస్ అనేవి డబ్బులు కట్టి మరీ ఫాలో అయ్యేవారు తక్కువ.

ఆధారం: ఆపిల్

Connect On :