దీనిలో 300 బగ్స్ ఫిక్సేస్ మరియు కొత్త లాగిన్ స్క్రీన్ ఉన్నాయి.
విండోస్ 10 కొత్త బిల్డ్ ను రిలీజ్ చేసింది. ఒక్క రోజు ముందు రిలీజ్ చేసిన 10158 బిల్డ్ కు బగ్స్ ఉన్నాయని 300 బగ్స్ ను ఫిక్స్ చేసి 10159 కొత్త బిల్డ్ ను విండోస్ Insider ఫాస్టర్ రింగ్ లో దించింది. దీనిలో కొత్త లాగిన్ స్క్రీన్ కూడా ఉంది.
10158 బిల్డ్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, కొత్త ఫోటోస్ అప్లికేషన్, వాయిస్ అసిస్టంట్ Cortana అప్డేట్స్ ఇతర ఓవర్ ఆల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇమ్ప్రూవమేంట్స్ ఉండేవి.
అసలు విండోస్ ఎప్పుడు విడుదల చేసింది మొదటి విండోస్ 10 బిల్డ్ ను?
ప్రస్తుతం డెవలపర్ బిల్డ్స్ ను లాంచ్ చేసింది. జులై 29 న స్టేబుల్ బిల్డ్ విండోస్ 7 మరియు విండోస్ 8 యూజర్స్ కు 10 ఫ్రీ అపగ్రేడ్ గా రానుంది. కాని ముందుగా మీరు రిసర్వ్ చేసుకుంటేనే వస్తుంది. రిసర్వ్ చేసుకుంటే మీ కంప్యుటర్ హార్డ్వేర్ కి విండోస్ 10 సపోర్ట్ అవుతుందో లేదో చూసి బ్యాక్ గ్రౌండ్ లో ఫైల్స్ ను డౌన్లోడ్ చేసి, జులై 29 నాటికి విండోస్ 10 ఫైల్స్ అన్ని ఇంస్టాల్ అయ్యి, ఒక సంవత్సరం పాటు ఫ్రీ గా ఫుల్ వెర్షన్ విండోస్ 10 ను వాడుకోగలరు.