విండోస్ 10 జూలై 29 శుక్రవారం తరువాత ఫ్రీ అప్ గ్రేడ్ అవ్వదు. 8000 రూ ప్రైస్ టాగ్ తో వస్తుంది. మీరు కనుక friday తరువాత OS ను అప్ గ్రేడ్ చేద్దమనుకుంటే 8000 రూ ఖర్చు అవుతుంది.
శనివారం నాటికీ విండోస్ 10 రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది. అయితే ఫ్రీ అప్ గ్రేడ్ ఆప్షన్ enterprise ఎడిషన్ ప్రివియస్ విండోస్ వెర్షన్స్ కు లేదు.
enterprise అంటే ఆఫీస్, బిజినెస్ లకు వాడేది. ఫ్రీ అప్ గ్రేడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవటానికి.. గతంలో తెలిపిన ఆర్టికల్స్ ను క్రింద లింక్స్ లో చూడగలరు.
మా పర్సనల్ ఒపీనియన్ లో విండోస్ 10 నచ్చలేదు. కారణాలు..
1. File explorer ఓపెన్ చేస్తున్నా చాలా స్లో గా ఓపెన్ అవుతుంది. కేవలం ఒక్క PC లోనే కాదు చాలా మందికి అలానే ఉంది. సో విండోస్ 7 వాడుతున్న. file explorer లాంటి మినిమమ్ ఫంక్షన్స్ ఈజీగా పనిచేస్తున్నాయి దీనిలో.
2. విండోస్ 10 సర్చ్ లో ఇంస్టాల్ చేసుకున్న సాఫ్ట్ వేర్స్ సర్చ్ చేయటం చాలా కష్టం. ఇదే ప్రివియస్ విండోస్ లో మినిమమ్ ఫంక్షనాలిటీ.
3. జనరల్ గా కూడా స్లోగా ఉంది. ఎన్ని రకాల ట్రిక్స్ అండ్ టిప్స్ వాడినా స్పీడ్ పెరిగినట్లు కనిపించలేదు.
ఆఫ్ కోర్స్ సెక్యురిటీ అప్ డేట్స్ అవీ విండోస్ ప్రివియస్ ఎడిషన్స్ కన్నా win 10 లో బాగా ఉండవచ్చేమో కాని మనకు డైలీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఇబ్బంది కలిగిస్తూ, కంటికి కనపడని సెక్యురిటీ ను అందించనా ఏమి ఉపయోగం అని అనిపిస్తుంది.