గ్రూప్ వాయిస్ మరియు వీడియో కాలింగ్ మీద వాట్సప్ చాలా కాలం నుంచి పనిచేస్తోంది .చాల నివేదికల మధ్య , మే లో జరిగిన పేస్ బుక్ వార్షిక ఎఫ్8 కాన్ఫరెన్స్ లో దీని ఫీచర్ల మీద వచ్చిన గాలి వార్తలనన్నింటిని పటాపంచలు చేస్తూ దీని వివరాలను స్పష్టం చేసింది. ప్రకటన చేసిన తరువాత వెంటనే, ఆండ్రాయిడ్ మరియు iOS ల బీటా అప్డేట్ల ఒక్క ఫీచర్ల వివరను గోప్యంగా గమనించారు కూడా. పేస్ బుక్ సొంత ఆప్ అయిన ఇన్స్టాంట్ మెసేజింగ్ ఆప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగధారులందరికి కూడా ఇది అందుబాటులో ఉన్నదని ప్రకటనచేసింది.
"రెండు సంవత్సరాలకు పైగా వాట్సాప్ ను వాయిస్ మరియు వీడియో కాలింగ్ సేవల ద్వారా ప్రజలు ఆనందించారు . అయితే నిజానికి, రోజుకు 200 కోట్ల నిముషాల వాయిస్ మరియు వీడియో కాల్స్ తో వినియోగదారులు వాట్సాప్ లో సమయం గడుపుతున్నారు. ఈరోజు నుండి వాయిస్ మరియు వీడియో గ్రూప్ కాల్స్ ను వాట్సాప్ లో అందిస్తున్నందుకు సంతోషిస్తున్నామని " కంపెనీ బ్లాగులో ప్రకటించింది. వినియోగదారులు ఒకేసారి నలుగురితో ఓకే గ్రూపుగా వాయిస్ లేదా వీడియో చేసికోవచ్చు. ఇలా గోపీ కాల్ చేయడానికి , ముందుగా మీరు ఒకరికి వాయిస్ లేదా వీడియో కాల్ చేయవలసి ఉంటుంది —సాధారణంగా మనం మొబైల్ లో కాన్ఫరెన్స్ కాల్ చేసేలాగానే. ఈ కాల్ కు ఇంకొకరిని జోడించడం(ఆడ్) కోసం కేవలం పైభాగం లో కుడివైపున మూలలో కలిపించే "యాడ్ పార్టిసిపెంట్" అనే బటన్ ను నొక్కవలసి ఉంటుంది అంతే.
"గ్రూప్ కాల్స్ ఎప్పుడు కూడా ఎండ్ -తో-ఎండ్ యెన్క్రిప్ట్ గా ఉంటాయి,అందుకనే మేము దీనిని వివిధ నెట్వర్క్ పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేశాము", అని వాట్సాప్ తెలిపింది. ప్రజలు తరచుగా కాల్ డ్రాప్స్ నుండి బాధపడటం జరుగుతుంటుంది ఒక ప్రత్యేకమైన లక్షణం వలన వీడియో కాల్స్ చేసేటప్పుడు అంతరాయం కలుగకుండా తగిన కనెక్టివిటీని కలుగజేసే వీలుండడం భారతీయులకు ఒక మంచి శుభవార్త.
ఈ నెల ప్రథమార్ధంలో , వాట్సాప్ విడుదల చేసిన 'సస్పీసీఎస్ లింక్ డిటెక్షన్ ' అని పిలువబడే ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సాప్ లో పంపిన లేదా అందుకున్న హానికరమైన లింకులను గుర్తించే వీలుంది . వాట్సాప్ ప్లాట్ఫారం ను మరింత సురక్షితంగా ఉంచడమే ఈ ఫీచర్ లక్ష్యం. గత వారం లో జరిగిన ఫేస్ బుక్ యొక్క Q2 ఎర్నింగ్ కాల్ 2018 లో కంపెనీ సిఈఓ అయినటువంటి మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ ఇప్పుడు 1.5 బిలియన్ల నెలసరి క్రియాశీల వినియోగదారులను కలిగి ఉందని ప్రకటించారు.