Whatsapp యూజర్లకు ఉచితంగా అందుతున్న ఒక అద్భుతమైన అవకాశం ఇక నుండి ఉండదని వాట్సాప్ చెబుతోంది. అయితే, ఈ చేదు వార్త కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే సుమండీ. అంటే, iOS యూజర్లకు మాత్రం ముందు నుండే కొసాగుతున్న విధంగానే కొనసాగుతుంది. ఇంతకీ ఏమిటా అసలు విషయం అని ఆలోచిస్తున్నారా? అదే మ్యాటర్ కి వస్తున్నా. వాట్సాప్ యూజర్లకు అన్లిమిటెడ్ బ్యాకప్ అవకాశం అందించింది వాట్సాప్. అయితే, ఇప్పటి వరకూ అనుభవిస్తున్న ఈ అన్లిమిటెడ్ బ్యాకప్ స్టోరేజ్ ఇక నుండి ఆండ్రాయిడ్ యూజర్లకు లిమిటెడ్ గా మారుతుంది.
చాలా కాలంగా వాట్సాప్ బ్యాకప్ కోసం ఆండ్రాయిడ్ యూజర్లకు వారి గూగుల్ అకౌంట్ నుండి అన్లిమిటెడ్ బ్యాకప్ ఆఫర్ చేస్తోంది. అయితే, ఇక నుండి Whatsapp యూజర్లకు ఇక నుండి ఆ అవకాశం ఉండదని, వాట్సాప్ మరియు గూగుల్ సంయుక్తంగా తెలిపాయి.వాట్సాప్ బీటా యూజర్లు ఈ డిసెంబర్ నుండే చాట్ హిస్టరీ, ఇమేజెస్ మరియు వీడియోలు కూడా వారి గూగుల్ డ్రైవ్ డేటా లిమిటెడ్ స్టోరేజ్ ను పంచుకుంటాయి.
అంటే, గూగుల్ ఆఫర్ చేస్తున్న 15GB ఉచిత గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ లో మీ వాట్సాప్ బ్యాకప్ స్టోర్ చేయబడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ డేటా కోరుకుంటే మాత్రం గూగుల్ అధిక స్టోరేజ్ కోసం ఆఫర్ చేస్తున్న ప్లాన్ లలో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
Also Read : Poco X6 5G: అప్ కమింగ్ పోకో ఫోన్ గురించి కొత్త విషయాలు తెలుసుకోండి.!
అయితే, మీరు మీ స్టోరేజ్ ను సరిగ్గా ఉపయోగించుకోవాలనుకుంటే, మీ వాట్సాప్ అకౌంట్ నుండి మీకు అవసరం లేని వాటిని డిలీట్ చేయడం ద్వారా మీ స్టోరేజ్ ను కొంత వరకూ పెంచుకోవచ్చు. వాట్సాప్ నుండి డిలీట్ చేసినవి క్లౌడ్ బ్యాకప్ నుండి కూడా డిలీట్ అవుతాయి. అంటే, మీ స్టోరేజ్ లో కొంత స్టోరేజ్ మళ్ళీ వాడుకునే అవకాశం లభిస్తుంది. అయితే, అదికూడా సరిపోకపొతే మాత్రం మీరు ఆదనపు స్టోరేజ్ కోసం గూగుల్ వన్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ కూడా యాక్షన్ 2024 ప్రథమార్ధం నుండి మొదలవుతుందని వాట్సాప్ తెలిపింది. అయితే, ఈ చర్య మొదలు పెట్టడానికి 30 రోజులు ముందుగా నోటిఫికేషన్ అందుతుందని కూడా వాట్సాప్ తెలిపింది.