మీ ఫోన్ కు ఈ కాల్స్ వస్తే డోంట్ లిఫ్ట్..కొత్త స్కామ్ గురించి తెలుసుకోండి.!

Updated on 29-May-2023
HIGHLIGHTS

ఇప్పుడు దేశంలో మరొక కొత్త స్కామ్ చక్కర్లు కొడుతోంది

, ఈ కొత్త స్కామ్ తో జాగ్రత్తగా ఉండాలని హితవు

స్కామర్లు ఇప్పుడు మరొక కొత్త పద్దతి ద్వారా మోసం చేస్తున్నారు

ఇప్పుడు దేశంలో మరొక కొత్త స్కామ్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చాలా మంది దీని గురించి రిపోర్ట్స్ చేస్తుండగా, ఈ కొత్త స్కామ్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గతంలో, అంతర్జాతీయ నంబర్స్ నుండి టెలీ కాల్స్ మరియు మెసేజిల ద్వారా స్కామర్లు ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే. అయితే, TRAI కొత్త నిర్ణయంతో ఈ ఇంటర్నేషనల్ కాల్స్ మరియు SMS లకు చెక్ పెట్టింది. అయితే, ఎప్పటి కప్పుడు కొత్త పద్దతులను ఎంచుకునే స్కామర్లు ఇప్పుడు మరొక కొత్త పద్దతి ద్వారా మోసం చేస్తున్నారు. 

స్కామర్లు ఇప్పుడు వాట్సాప్ కాల్స్ ద్వారా మోసాలకు తెగబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ కోడ్స్ నుండి వాట్సాప్ కాల్స్ అందుకున్న యూజర్లు వాట్సాప్ కు రిపోర్ట్ అందించిన విషయాన్ని కూడా ఆన్లైన్లో పెట్టారు. అంతేకాదు, ఇదే విషయంగా సైబర్ క్రైమ్  పోలీస్ లకు కూడా కంప్లైంట్స్ చేసినట్లు కూడా పేర్కొన్నారు. దీనిపైన స్పందించిన వాట్సాప్ ఇటివంటి మోసపూరిత కాల్స్, అంటే ఇంటర్నేషనల్ కోడ్స్ తో ఏదైనా కాల్స్ వచ్చినట్లయితే ఆ నంబరును వెంటనే బ్లాక్స్ చేసి రిపోర్ట్ చెయ్యాలని తెలిపింది. 

వాట్సాప్ లో +84, +62(ఇండోనేషియా), +223 (మాలీ), +977(నేపాల్), ఇలా ఇంటర్నేషనల్ కోడ్స్ తో కాల్స్ ను అందుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇది ఇక్కడికే పరిమియం కాకపోవచ్చు. వాస్తవానికి ఈ కోడ్స్ నుండి కాల్స్ వస్తునంత మాత్రాన ఈ నంబర్స్ ఆ దేశం నుండే వస్తున్నాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) ద్వారా ఈ కాల్స్ ను ప్రపంచంలో ఎక్కడి నుండైనా మేనేజ్ చేసే వీలుంది. 

అందుకే, మీకు తెలియని ఇంటర్నేషనల్ వాట్సాప్ కాల్స్ మీ ఫోన్ లో అందుకుంటే, వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం మంచింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :