వాట్సాప్ గుడ్ న్యూస్: ఇక స్మార్ట్ వాచ్ లలో కూడా వాట్సాప్ సేవలు.!
స్మార్ట్ వాచ్ లలో కూడా వాట్సాప్
స్మార్ట్ వాచ్ లలో కూడా వాట్సాప్ చాటింగ్, రీప్లే
స్మార్ట్ వాచ్ లో Whatsapp ఉపయోగించుకోవచ్చని గూగుల్ అనౌన్స్
మెటా యాజమాన్యం లోని వాట్సాప్ తన యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్ వాచ్ వినియోగాన్ని దృష్టులో ఉంచుకొని స్మార్ట్ వాచ్ లలో కూడా వాట్సాప్ ని ఆనందించని తెలిపింది. అంటే, మొబైల్ ఫోన్ లలో మాదిరిగానే స్మార్ట్ వాచ్ లలో కూడా వాట్సాప్ చాటింగ్, రీప్లే వంటి వాటిని చేసుకోవచ్చన్న మాట. అయితే, ఇది అన్ని స్మార్ట్ వాచ్ లలో ఉపయోగించే అవకాశం ఉండదు. స్మార్ట్ వాచ్ ల కోసం గూగుల్ అందించిన Wear OS తో పనిచేసే స్మార్ట్ వాచ్ లలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
ఈరోజు నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న Google Wear OS తో పనిచేసే స్మార్ట్ వాచ్ లో Whatsapp ఉపయోగించుకోవచ్చని గూగుల్ అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫీచర్ తో గూగుల్ వేర్ OS తో పనిచేసే స్మార్ట్ వాచ్ లలో చాటింగ్, రిప్లై మరియు కాల్స్ అటెండ్ చెయ్యొచ్చు. దీని గురించి గూగుల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ కూడా చేసింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
.@WhatsApp is now available globally on #WearOS!
Start new chats, reply to messages by voice and answer calls from your watch – safely and securely.
Download it here on Google Play: https://t.co/y2eGfMAwGy pic.twitter.com/vUMy1T7fSn
— Wear OS by Google (@WearOSbyGoogle) July 19, 2023
Wear OS స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను ఎలా ఉపయోగించాలి?
ఇక Wear OS స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను ఎలా ఉపయోగించాలి అని చూస్తే, ముందుగా మీరు మీ Wear OS స్మార్ట్ వాచ్ లో వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అటు తరువాత, మీ స్మార్ట్ వాచ్ లో ఇన్స్టాల్ చేసిన ఈ వాట్సాప్ యాప్ ని మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ అకౌంట్ తో లింక్ చెయ్యాలి. అంతే, మీ స్మార్ట్ ఫోన్ లో మాదిరిగానే ఈ స్మార్ట్ వాచ్ లో కూడా వాట్సాప్ చాటింగ్, రిప్లై మరియు కాలింగ్ ను మీరు ఎంజాయ్ చేయవచ్చు.
మీరు కూడా Google Wear OS స్మార్ట్ వాచ్ ఉపయోగిస్తున్నట్లయితే వాట్సప్ ను మీ స్మార్ట్ వాచ్ లో ఉపయోగించుకోవచ్చు.