WhatsApp New ఫీచర్ తో ఇక వాట్సాప్ లోనే అన్ని పనులు చేసుకోవచ్చు.!
WhatsApp New ఫీచర్ ను ఇండియన్ యూజర్ల కోసం రిలీజ్ చేసింది
ఈ కొత్త ఫీచర్ తో ఇక వాట్సాప్ లోనే అన్ని పనులు చేసుకోవచ్చు
వాట్సాప్ సరికొత్తగా రోల్ అవుట్ చేసిన Meta AI ఫీచర్
WhatsApp New ఫీచర్ ను ఇండియన్ యూజర్ల కోసం రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ తో ఇక వాట్సాప్ లోనే అన్ని పనులు చేసుకోవచ్చని కూడా చెబుతోంది. వాట్సాప్ కొత్తగా తీసుకు వచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏమిటా అని అనుకుంటున్నారా? వాట్సాప్ సరికొత్తగా రోల్ అవుట్ చేసిన Meta AI ఫీచర్ గురించే నేను చెబుతోంది. ఈ కొత్త ఫీచర్ తో మీవాట్సాప్ లోనే క్రియేటివ్ ఇమేజెస్ మొదలుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వరకూ అన్ని పనులను చక్కబెట్టేయవచ్చు.
WhatsApp New ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో ఇటీవల అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ Meta AI ఫీచర్ ను ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ ను మీరు చాట్ లిస్ట్ లో చూడవచ్చు మరియు వాట్సాప్ మెయిన్ స్క్రీన్ పైన మల్టీ కలర్ రింగ్ రూపంలో కూడా కనిపిస్తుంది.
ఒకవేళ మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపించక పోయినట్లయితే, వాట్సాప్ యాప్ ని అప్డేట్ చేసి చెక్ చేయండి. ఈ ఫీచర్ ఇప్పటికే ఇండియాలోని చాలా మంది వాట్సాప్ యూజర్లు అందుకున్నారు.
Also Read: Moto G64 5G: స్లీక్ డిజైన్, సూపర్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఈ ఫీచర్ ఉపయోగాలు ఏమిటి?
ఈ వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా కొత్త యూజర్ ఎక్స్ పీరియన్స్ ను పొందవచ్చు. ఎందుకంటే, ఈ ఫీచర్ తో మీ వాట్సాప్ లో కొత్త ఫాంట్ మరియు లాంగ్వేజ్ టైపింగ్, ఇమేజ్ క్రియేషన్ మొదలుకొని అన్ని పనులను చక్కబెట్టేయవచ్చు. ఉదాహరణకు మీరు మీకు నచ్చిన కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేయాలంటే ఈ Meta AI ఫీచర్ లో మీకు కావాల్సిన ఇమేజ్ ను గురించి వివరాలను టైప్ చేసి సెండ్ చేస్తే చాలు, మీరు కోరుకున్న ఇమేజ్ మీకు అందుతుంది.
అంతేకాదు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, కవితలు, కథలు వంటి ఏ విషయాన్నైనా మెటా ఎఐ నుండి అందుకోవచ్చు. అంతేకాదు, చాటింగ్ టైప్ బాక్స్ క్రింద కొత్త 4 బాక్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పైన నొక్కడం ద్వారా మరిన్ని కొత్త ఫీచర్ లను చూడవచ్చు. ఇందులో మీకు చాలా కొత్త ఆప్షన్ లు కనిపిస్తాయి మరియు వీటితో కొత్త యూజర్ అనుభూతిని పొందవచ్చు.