వాట్సాప్ కొత్త ఫీచర్: ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్.!

వాట్సాప్ కొత్త ఫీచర్: ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్.!
HIGHLIGHTS

వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది

అప్ కమింగ్ ఫీచర్ తో ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్

రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది

కొత్త ఫీచర్ లను అందించడంలో పెట్టింది పేరైన వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ తో ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఈ సంవత్సరం తీసుకువచ్చిన లింక్డ్ డివైజ్ ఫీచర్ కు అదనపు ఫీచర్ గా తీసుకువస్తోంది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ల బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ యొక్క స్టేబుల్ అప్డేట్ వెర్షన్ ను వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురావచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్:

వాట్సాప్ యూజర్లు కేవలం ఒక ఫోన్ లో మాత్రమే వారి మొబైల్ నంబర్ తో వారి వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం వుంది. అయితే, ఇప్పుడు తీసుకువస్తున్న వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన లింక్డ్ డివైజ్ లకు ఇది బిన్నం. ఎందుకంటే, వాట్సాప్ యూజర్లు వారి ల్యాప్‌టాప్‌లు మరియు టాబ్లెట్‌లు వంటి నాలుగు ఇతర పరికరాలకు వారి అకౌంట్ లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, కంపెనీ ఇప్పుడు రెండు ఫోన్లలో ఒక వాట్సాప్ నంబర్‌కు లాగిన్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ తో డ్యూయల్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ అకౌంట్ వాడకం మరింత సులభతరం చేస్తుంది.

ఇక వాట్సాప్ తీసుకురావాలని కూడా యోచిస్తోంది. ఈ ఫీచర్ విషయానికి వస్తే, ఒక నిర్దిష్ట అకౌంట్ ప్రస్తుతం ఎన్ని డివైజ్‌ లలో లాగిన్ చేయబడిందో చెక్ చేయడానికి WhatsApp ఒక మార్గాన్ని అందిస్తుంది. వారి లాగిన్ వివరాలను ధృవీకరించడానికి వాట్సాప్ యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది మరియు వారి అకౌంట్ పైన మరింత భద్రతను ఇస్తుంది.

ఒకేసారి 2 మొబైల్ ఫోన్‌ లలో ఒకే వాట్సాప్ నంబర్

WhatsApp యొక్క ఈ కొత్త ఫీచర్‌ను ప్రయత్నించాలనుకునే మీరు ముందుగా మెసేజింగ్ యాప్ యొక్క బీటా వెర్షన్ కోసం సైన్ అప్ చేయాలి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo