Whatsapp: యూజర్ల కోసం మరొక బిగ్ ఫీచర్..!
అతిపెద్ద మెసేజింగ్ యాప్ Whatsapp మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది
యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీ తో పాటుగా అనుకూలత
Whatsapp అప్ కమింగ్ కొత్త ఫీచర్
అతిపెద్ద మెసేజింగ్ యాప్ Whatsapp మరొక కొత్త ఫీచర్ ను తీసుకు వస్తోంది. యూజర్ల సెక్యూరిటీ మరియు ప్రైవసీ తో పాటుగా అనుకూలతకు కూడా పెద్ద పీఠ వేస్తూ చాలా ఫీచర్లను తీసుకు వచ్చిన వాట్సాప్ ఇప్పుడు ఇదే దారిలో మరొక కొత్త ఫీచర్ ను కూడా తీసుకు వచ్చింది. వాట్సాప్ యూజర్లు త్వరలో అందుకోనున్న చెబుతున్న ఈ అప్ కమింగ్ వాట్సాప్ కొత్త ఫీచర్ వివరాలు ఏమిటో చూద్దాం.
Whatsapp: కొత్త ఫీచర్
త్వరలోనే వాట్సాప్ యూజర్లకు మంచి అనుకూలతను మరియు సౌకర్యాన్ని అందించే కొత్త ఫీచర్ ను వాట్సాప్ యూజర్లు అందురూ కూడా అందుకుంటారు. ఇప్పటికే ఈ ఫీచర్ ను బీటా యూజర్ల కోసం జత చేయబోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాట్సాప్ లో ఫొటోలు, వీడియోలు, GIFs మరియు డాక్యుమెంట్స్ యొక్క క్యాప్షన్ లను ఎడిట్ చేసే ఫీచర్ ను వాట్సాప్ ఇప్పుడు కొత్తగా జత చేస్తుంది. ముందుగా మెసేజ్ ఎడిట్ అప్షన్ ను యాప్ లో జత చేసిన వాట్సాప్, ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి ఈ కొత్త ఫీచర్ ను కూడా అందించింది.
అంతేకాదు, అతి త్వరలోనే అందరు యూజర్లు కూడా ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందుకుంటారని కూడా నివేదికలు చెబుతున్నాయి. రీసెంట్ గా కూడా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందించింది. అదే, HD Photo సెండ్ ఫీచర్ మరియు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాట్సాప్ యూజర్లకు ఈ కొత్త HD Photo సెండ్ ఫీచర్ అప్షన్ వాట్సాప్ అందించింది.
ఈ ఫీచర్ ద్వారా HD ఫోటో లను నేరుగా పంపించవచ్చు. ముందుగా కేవలం స్టాండర్డ్ ఫోటో లను మాత్రమే సెండ్ చేయగలిగితే, ఇప్పుడు ఈ అప్షన్ ను HD ఫోటో లకు వాట్సాప్ అప్గ్రేడ్ చేసింది. ఇప్పుడు మీరు పంపించాలను కునే ఫోటోలను HD క్వాలిటీతో ఫోటోలను షేర్ చెయవచ్చు.
మీరు కూడా మీ ఫోన్ నుండి HD ఫోటోలను సెండ్ చెయ్యాలనుకుంటే, మీ వాట్సాప్ నుండి మీరు ఫోటోలను సెండ్ చేసే ముందు ఫోటో సెలెక్ట్ చేసే సమయంలో సెండ్ కు ముందు ఫోటో పైన HD అని కనిపించే వద్ద సెలక్ట్ చేసిన తరువాత వచ్చే అప్షన్ లో HD image క్వాలిటీ ని ఎంచుకోవాలి. అంతే, మీరు పంపించే ఫోటోలు HD Quality తో పంపించబడతాయి మరియు ఫోటో పైన HD అని వాటర్ మార్క్ కూడా వస్తుంది.