Whatsapp Trick: నెట్ ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ ఆఫ్ చేసేందుకు బెస్ట్ ట్రిక్..!!

Updated on 09-Oct-2022
HIGHLIGHTS

నెట్ ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ ఆఫ్ చేసేందుకు బెస్ట్ ట్రిక్

అత్యవసర సమయంలో మీకు ఈ ట్రిక్ ఉప్పయోగపడుతుంది

Whatsapp నోటిఫికేషన్ల బెడద నుండి ఈ ట్రిక్ తో మీరు తప్పించుకోవచ్చు

Whatsapp Trick: నెట్ ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ ఆఫ్ చేసేందుకు బెస్ట్ ట్రిక్ గురించి మీకు తెలుసా? మీకు తెలియకపొతే ఈరోజు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యమైన లేదా అత్యవసర సమయంలో మీకు ఈ ట్రిక్ ఉప్పయోగపడుతుంది. మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ Whatsapp ని ఆఫ్ లైన్ చేయవచ్చు. మీరు పనిలో ఉన్నప్పుడు Whatsapp నోటిఫికేషన్ల బెడద నుండి ఈ ట్రిక్ తో మీరు తప్పించుకోవచ్చు. అయితే, నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి Pause It App డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది.

ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని మీరు అనుకుంటే మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.

దీనికోసం మీరు మీరుచేయవల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయ్యడమే. తరువాత, యాప్ లో Active Apps పైన ఉన్న టోగుల్ బటన్ ని నొక్కితే చాలు మీకు కావాల్సిన యాప్స్ డేటా ఆఫ్ అవుతుంది. అంతేకాదు,  మీరు ఎంత సమయం మీ వాట్స్ఆప్ ని ఆఫ్ చేయాలనుకుంటారో అంత టైం ను కూడా సెట్ చేసుకోవచ్చు. డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది.

ఈ విధంగా చేస్తే మీరు వాట్సాప్‌ లో డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు

మొదట వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.

ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.

అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.

దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.

ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని బాక్స్ ల పక్కన ఎంపికను తీసివేయండి.

అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :