వినియోగదారుల ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వాట్సాప్, యూజర్ల కోసం కొత్త ఫీచర్లను జత చేస్తూనే వుంది. ఇప్పుడు కూడా అదే దారిలో మరొక కొత్త ఫీచర్ ను జత చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ ఆన్లైన్ లో ఉన్నా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఆన్లైన్లో ఉన్నా కూడా లేనట్టే చేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. మరి ఆ కొత్త ఫీచర్ ముచ్చట్లు ఏమిటో చూద్దామా.
ఈ కొత్త ఫీచర్ గురించి మాట్లాడితే, మీరు వాట్సప్ లో ఆన్లైన్ లో ఉన్నాకూడా ఎవరికీ ఈ విషయం తెలియంకుండా చేసేలా కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. దీని ద్వారా, వాట్సాప్ లో తమ ఆన్లైన్ స్టేటస్ ను చూపించడ ఇష్టపడని వారు దాన్ని దాచిపెట్టవచ్చు. జనరల్ గా మనం వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఆన్లైన్ లో ఉన్న స్టేటస్ ను చూపిస్తుంది. కానీ, వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త ఫీచరతో ఇక ఆన్లైన్ స్టేటస్ కనిపించదు.
ఇక వాట్సాప్ లో మీకు ఉపయోగపడే మరొక కొత్త విషయం కూడా వుంది. అదేమిటంటే, మీరు మీ వాట్సాప్ నుండే మీ మార్క్ లిస్ట్ లతో సహా చాలా డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు వాట్సాప్ లో MyGov చాట్‌బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా DigiLocker యాప్ లేదా మరే ఇతర వెబ్‌సైట్‌కి వెళ్లే అవసరం లేకుండానే వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్లో ఈ రికార్డులను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Whatsapp లో డిజిలాకర్ నుండి పత్రాలను డౌన్లోడ్ ఎలా చెయ్యాలి.!
1. మీ ఫోన్ లో WhatsApp యాప్ తెరవండి
2. +919013151515 నంబర్ కి "DigiLocker" అని టైప్ చేసి మెసేజ్ పంపండి
3. తరువాత, మీరు DigiLocker అకౌంట్ ను క్రియేట్ చేయడానికి లేదా నిర్ధారించడానికి అప్షన్ లను చూస్తారు
4. ఇది మీకు పత్రాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది (మీ ఆధార్ నంబర్ని ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత).
5. ఇక్కడ మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా క్లాస్ X, మరియు XII మార్క్ షీట్ల వంటి డాక్యుమెంట్ ఎంపికలతో కూడిన Menu ని చూస్తారు.
6. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు
డిజిలాకర్ ఎన్క్రిప్షన్ సురక్షితమైనదని పేర్కొంది మరియు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న డాక్యుమెంట్ లకు మాత్రమే యూజర్లకు యాక్సెస్ ఇస్తుంది.