మెటా యజమాన్యంలోని WhatsApp, Facebook మరియు Instagram ప్లాట్ ఫామ్స్ డౌన్ అయిన కారణంగా యూజర్లు అసహనానికి గురైనట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ యూజర్లు ఈ సమస్యను చూస్తున్నట్లు మూకుమ్మడిగా కంప్లైంట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మెటా యాప్స్ పూర్తిగా డౌన్ అయ్యాయని యూజర్లు మొహమాటం లేకుండా చెబుతున్నారు.
అవుటేజ్ ప్రాబ్లమ్స్ గురించి రియల్ టైమ్ లో డేటా అందించే Downdetector నుంచి ఈ రిపోర్టు దర్శనమిచ్చింది. డౌన్ డిక్టేటర్ ప్రకారం, వాట్సాప్, ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ మూడు యాప్స్ కూడా డౌన్ అయినట్లు యూజర్ల నుంచి భారీ సంఖ్యలో రిపోర్ట్ లను అందుకుంది.
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ డౌన్ అయినట్టు 35,000 ల మందికి పైగా యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇందులో ఫీడ్ రిఫ్రెష్ చేయలేకపోవడం, మెసేజ్ లు సెండ్ చేయలేక పోవడం మరియు ఫోటోలు అప్లోడ్ చేయలేక పోవడం వంటి సమస్యలు యాప్ లో చూస్తున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు.
అత్యంత ప్రాచుర్యం కలిగిన మెటా చాటింగ్ యాప్ వాట్సాప్ కూడా డౌన్ అయినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. వాట్సాప్ నుంచి మెసేజ్ సెండ్ లేదా రిసీవ్ చేసుకోవడం లో సమస్యలు చూస్తున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ఈ రిపోర్ట్ చేసిన వారి సంఖ్య 20 వేలకు పైగానే ఉంది.
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా యాప్ గా వెలుగుతున్న ఫేస్ బుక్ కూడా డౌన్ అయినట్లు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. అయితే, ఈ రిపోర్ట్ తక్కువ సంఖ్యలోనే వుంది. ఫేస్ బుక్ యాప్ తమ ఫీడ్ ను రిఫ్రెష్ చేయలేక పోతున్నట్లు యూజర్లు చెబుతున్నారు. ఫేస్ బుక్ పైన కూడా 7,000 వేలకు పైగా రిపోర్ట్స్ Downdetector లో నమోదు అయ్యాయి.
Also Read: చవక ధరలో రెండు కొత్త Smart Tv లను లాంచ్ చేసిన Daiwa.!
ఇటీవల కాలంలో షోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా డౌన్ అవుతున్నట్లు ఎక్కువగా కథనాలను చూస్తున్నాము. మరి దానికి దారి తీస్తున్న టెక్నీకల్ కారణాలు తెలియాల్సి వుంది.