వాట్సాప్ లో మీకు ఇష్టమైన Emoji తో రియాక్ట్ అవ్వండి.!!

Updated on 04-Aug-2022
HIGHLIGHTS

ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ ను ఇప్పుడు వాట్సాప్ అప్డేట్ చేసింది

ఇప్పుడు మీకు ఇష్టమైన Emoji తో రియాక్ట్ అయ్యేలా మారుతుంది

ఇప్పుడు మీకు నచ్చిన ఎమోజిని ఎంచుకునే అవకాశాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది

వాట్సాప్ లో ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ గురించి అందరికీ తెలుసు. అయితే, కేవలం కొద్దీ రియాక్షన్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ ను ఇప్పుడు వాట్సాప్ అప్డేట్ చేసింది. అంటే, కేవలం 6 ఎమోజి లకు మాత్రమే పరిమితమైన ఈ ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ ఇప్పుడు మీకు ఇష్టమైన Emoji తో రియాక్ట్ అయ్యేలా మారుతుంది. అంటే,  ఇప్పుడు మీకు నచ్చిన ఎమోజిని ఎంచుకునే అవకాశాన్ని వాట్సాప్ తీసుకొచ్చింది.  

మొదట ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ప్రవేశపట్టినప్పుడు వాట్సాప్ కేవలం ఆరు ఎమోజీలను మాత్రమే ఇందులో అందించింది. మెసేజ్ పైన నొక్కిన కొన్ని సెకన్ల తర్వాత, ఈ ఆరు ఎమోజీలు ప్రదర్శించబడ్డాయి, ఇందులో నుండి వినియోగదారులు వారికీ కావాల్సిన ఎమోజి ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారుల నుండి మంచి స్పందను అందుకోవడంతో, వాట్సాప్ ఈ ఫీచర్ కోసం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఎమోజి రియాక్షన్ కోసం పూర్తి ఎమోజి కీబోర్డ్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అయితే, ఈ అప్‌డేట్ వాట్సాప్ వినియోగదారులు అందరి కోసం ఇంకా ప్రకటించలేదు. ఈ ఫీచర్ కేవలం బీటా రిలీజ్ లో ఒక భాగంగా వస్తుంది. అంటే, Android మరియు iOS వినియోగదారుల కోసం వాట్సాప్ బీటా లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ అప్‌డేట్‌ ను బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :