మెటా యాజమాన్యం లోని Whatsapp చాలా వేగంగా కొత్త ఫీచర్లను తన యాప్ లో జత చేస్తోంది. రీసెంట్ గా మూడు అలరించే కొత్త ఫీచర్ లను జత చేసిన ఈ బిగ్గెస్ట్ మెసేజింగ్ యాప్, ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ ను జత చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఇటీవల మీడియా క్యాప్షన్ ఎడిటింగ్ ఫీచర్ మరియు HD Photo వంటి లేటెస్ట్ ఫీచర్లను వాట్సాప్ లో యాడ్ చేసిన తరువాత ఈ కొత్త డెవలప్మెంట్ బయటకి వచ్చింది.
Wabetainfo ఈ కొత్త ఫీచర్ గురించి ముందుగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, వాట్సాప్ లో టెక్స్ట్ ను మరింత అనుకూలంగా మరియు వినూత్నంగా చేసే 'Text Formatting Tools' ను యాప్ లో జత చేయాలని చూస్తోంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్థాయిలో ఉందని మరియు రానున్న కొత్త అప్డేట్ లో ఈ కొత్త ఫీచర్ ను కూడా జత చేస్తుందని ఈ నివేదిక చెబుతోంది.
ఈ కొత్త టెక్స్ట్ ఫోర్ మ్యాటింగ్ ఫీచర్ లో కోడ్ స్నిప్పెట్స్ ను బ్లాక్ చేయడానికి Syntex, కోటింగ్ స్పెసిఫిక్ టెక్స్ట్ మరియు టెక్స్ట్ లిస్ట్ క్రియేషన్ వంటివి ఉంటాయి. ఈ కొత్త టెక్స్ట్ ఫార్మాటింగ్ టూల్స్ ద్వారా ఫ్యూచర్ లో మెసేజిలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ నివేదిక చూపించింది. మీరు పంపించే టెక్స్ట్ ను ఒక ఫార్మాట్ రూపంలో సరళం చేసే అవకాశం ఈ కొత్త టెక్స్ట్ ఫోర్ మ్యాటింగ్ ఫీచర్ యూజర్లకు అందిస్తుంది.
వాట్సాప్ యాప్ ను చాలా పటిష్టంగా మార్చిన మెటా, ఇప్పుడు ఈ యాప్ ను కొత్త ఫీచర్ లతో మరింత ఈజీ మరియు స్ట్రాంగ్ గా చేస్తోంది. యూజర్లు కోరుకునే మరియు వారికి అవసరమైన ఫీచర్ లను అందించడంలో అందరి కంటే ముందుంటుంది వాట్సాప్. ఇదే వాట్సాప్ ను అని యాప్స్ కంటే ముందుండేలా చేసింది. రానున్న కాలంలో ఇంకా ఎలాంటి కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకు వస్తుందో చూడాలి.