వాట్సాప్ ను మరింత యూజర్ ఫ్రెండ్లి యాప్ గా చేసేందుకు ఈ యాప్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జత చేస్తోంది. ఇప్పటికే ఎన్నో జన రంజక ఫీచర్లను జత చేసిన వాట్సాప్, ఇప్పుడు యూజర్ల కోరిక మేరకు మరొక కొత్త ఫీచర్ ను కూడా జత చేసింది. అదే, Whatsapp Companion Mode మరియు ఈ ఫీచర్ ద్వారా ఒకేసారి 4 ఫోన్లలో ఒకే నంబర్ తో వాట్సాప్ ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ కొత్త ముచ్చట్లు ఏమిటో చూద్దామా.
ఒకేసారి నాలుగు డివైజ్ లలో వాట్సాప్ ను ఉపయోగించడం మీరు చూసి ఉండవచ్చు. అదేనండి, మల్టీ డివైజ్ ఫీచర్ తో మీరు ఫోన్, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ మరియు ట్యాబ్ లెట్ వంటి డివైజ్ లలో ఒకేసారి లాగిన్ అవ్వడం. ఈ ఫీచర్ లో మీరు ప్రైమరీ ఫోన్ నుండి మరొక ఫోన్ లో లాగిన్ అయితే, వెంటనే పాత ఫోన్ నుండి లాగ్ అవుట్ అవుతారు.
కానీ, కొత్త Whatsapp Companion Mode తో ఈ సమస్య నుండి చెక్ పెట్టింది వాట్సాప్. ఈ ఫీచర్ ని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ రోల్ అవుట్ చేసింది మరియు త్వరలోనే అందరికి చేరుతుందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ను అంది పుచ్చుకోవడానికి మరి కొంత కాలం వేచి ఉండాలి.
ఈ కొత్త వాట్సాప్ కాంపానియన్ మోడ్ తో మీరు ఒకేసారి నాలుగు స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించవచ్చు మరియు నాలుగు ఫోన్లలో ప్రతి ఫోన్ లో కూడా మీ ప్రైమరీ ఫోన్ లో మాదిరిగానే పర్సనల్ మెసేజీలు, మీడియా మరియు కాల్స్ పూర్తిగా end-to-end ఎన్ క్రిప్టెడ్ గా ఉంటాయని వాట్సాప్ తన బ్లాగ్ నుండి వెల్లడించింది.
అయితే, వాట్సాప్ కాంపానియన్ మోడ్ ఉపయోగానికి సంభందించి ఒక విషయాన్ని ఒక విషయాన్ని గురించి వాట్సాప్ నొక్కి చెప్పింది. అదేమిటంటే, యూజర్లు ఒకవేళ వారి ప్రైమరీ డివైజ్ ఎక్కువ కాలం ఇన్ యాక్టివ్ గా ఉంటే, కాంపానియన్ మోడ్ తో జత చెయ్యబడిన అన్ని ఫోన్ల నుండి ఆటో మ్యాటీగ్గా వాట్సాప్ లాగ్ అవుట్ చేస్తుంది.
వాట్సాప్ కాంపానియన్ మోడ్ తో ఫోన్లను లింక్ చేయడం ద్వారా పాట ఫోన్ లో వాట్సాప్ ను తొలగించి కొత్త ఫోన్లలో లాగిన్ చేసే అవసరం లేకుండా కొత్త ఫోన్లలో కూడా ఈజీగా అదే నంబర్ తో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు.