WhatsApp AI image: ఫోటో ఎడిటింగ్ కోసం కొత్త AI ఫీచర్ తెచ్చిన వాట్సప్.!
వాట్సప్ యూజర్లకు పండగ లాంటి వార్త ప్రకటించింది
వాట్సాప్ ఫోటో ఎడిటింగ్ కోసం కొత్తగా AI ఫీచర్ ని తీసుకువచ్చింది
WhatsApp AI image (AI) ని ఉపయోగించి ఇమేజ్ లను క్రియేట్ చేస్తుంది
WhatsApp AI image: మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ యూజర్లకు పండగ లాంటి వార్త ప్రకటించింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యాప్ ను అప్డేట్ చేసే వాట్సాప్, ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్సప్ జోడించింది. ముందు మెటా లో వచ్చి చేరిన ఈ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ తో అద్భుతమైన ఇమేజ్లను మీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకుని సౌకర్యం ఉంటుంది.
ఏమిటా కొత్త ఫీచర్?
వాట్సాప్ ఫోటో ఎడిటింగ్ కోసం కొత్తగా AI ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కేవలం ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా నచ్చిన ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పని చేయడానికి వాట్సప్ Meta AI ని ఉపయోగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, వాట్సాప్ artificial intelligence (AI) నీ ఉపయోగించి ఇమేజ్ లను క్రియేట్ చేస్తుంది.
WhatsApp AI image ఫీచర్ ను ఎలా ఉపయీగించాలి?
వాట్సప్ ఎప్పుడు కూడా కొత్త ఫీచర్లను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మరియు వినియోగించడానికి సులభంగా ఉండేలా అందిస్తుంది. . ఈ కొత్త ఫీచర్ ని కూడా అదే విధంగా తీసుకువచ్చింది. వాట్సాప్ AI ఇమేజ్ ఫీచర్ ద్వారా చాలా సులభంగా ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ లను క్రియేట్ చేయడానికి వాట్సాప్ చాట్ లోకి వెళ్లి మెసేజ్ ఫీల్డ్ లో ‘@’ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి click /imagine ఎంచుకోండి. తర్వాత మీరు ఇమేజ్ ని మార్చాలనుకున్న తీరుని మెసేజ్ ఫీల్డ్ లో ప్రాంప్ట్ ఇవ్వండి. తర్వాత సెండ్ బటన్ పైన నొక్కండి.
అంతే, మీరు ఎంచుకున్న ఇమేజ్ యొక్కప్రాంప్ట్ తో కూడిన AI ఇమేజ్ జనరేట్ చెయ్యబడి చాట్ లో కనిపిస్తుంది.
Also Read: జబర్దస్త్ ఆఫర్: 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart TV అందుకోండి.!
ఇమేజ్ నచ్చక పొతే అప్డేట్ చేసుకోవచ్చా?
అవును మీకు ఇమేజ్ నచ్చక పొతే, మీరు క్రియేట్ చేసిన ఎఐ ఇమేజ్ ను అప్డేట్ కూడా చేసుకునే అవకాశం అందించింది. దీనికోసం మీరు క్రియేట్ చేసిన ఎఐ ఇమేజ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ కి వెళ్ళాలి. తరువాత రిప్లై పైన క్లిక్ చెయ్యాలి. తరువాత మెసేజ్ ఫీల్డ్ లో కావాల్సిన కొత్త ప్రాంప్ట్ టైప్ చేసి సెండ్ చేసి చేస్తే, కొత్త ఇమేజ్ క్రియేట్ చెయ్యబడుతుంది.
అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతానికి అందరికి అంధుబాటులోకి రాలేదు. ఇది కొన్ని దేశాలలోని యూజర్లకు అంధుబాటులోకి రాగా ఇక్కడ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంచింది.