AI Chatbot on WhatsApp: ముందుగా ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అందించిన మెటా, ఇప్పుడు వాట్సాప్ కి కూడా దీన్ని విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన వాట్సాప్ యాప్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను చేర్చడం ద్వారా యూజర్లకు కొత్త తరం అసిస్టెంట్ ఉపయోగం మరింత చేరువ చేసినట్లు అవుతుంది. ఇప్పటికే ఎఐ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పుడు వాట్సాప్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది.
వాట్సాప్ లో వర్చువల్ అసిస్టెంట్ ను అందుకోవడం ద్వారా యూజర్లు తగిన సలహా మరియు సహాయాన్ని అందుకోవచ్చని మెటా ఆలోచిస్తోంది. ఈ AI ఆధారిత అసిస్టెంట్ ఇప్పటికే అమెరికా లోని కొంత మంది వాట్సాప్ యూజర్లకు అందులోకి వచ్చింది. అంతేకాదు, యూజర్ ఉపయోగ అనుకూలను మరింత తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ను మరింతగా టెస్ట్ చేస్తోంది వాట్సాప్.
కొత్త నివేదికల ప్రకారం, కొత్త ఆండ్రాయిడ్ బీటా తో కొంత మంది బీటా యూజర్ల కోసం చాట్స్ లో షార్ట్ కట్ బటన్ అందులోకి తీసుకు వచ్చింది. మైన్ చాట్ లిస్ట్ లో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ గా కనిపిస్తుంది.
Also Read : Jio యూజర్లకు అధిక లాభాలను అందించే New Plans.!
ఈ ఎఐ వర్చువల్ అసిస్టెంట్ లేదా చాట్ బాట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, చాలా విషయాల్లో యూజర్లకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయం అందుతుంది.
ఇటీవలే మెటా ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లలో సరికొత్తగా Emu Video మరియు Emu Edit లను కూడా జత చేసింది. వీటి ద్వారా మరింత అనుకూలమైన ఇమేజ్ మరియు వీడియోలను యూజర్లు క్రియేట్ చేసుకునే అవకాశం మెటా అందించింది.
ఇలాంటి కొత్త విషయాలను మరియు కొత్త టెక్ లను వాట్సప్ లో కూడా యూజర్ల కోసం అందించే దిశగా మెటా కొనసాగుతోంది. వాస్తవానికి, 2023 ప్రారంభంలోనే కొత్త విషయాలు మెటా అన్నింటా యాడ్ చేస్తుందని తెలిపింది. ఈ కొత్త వర్చువల్ అసిస్టెంట్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.