వాట్సాప్ లో అంతర్జాతీయ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త.!

Updated on 29-May-2023
HIGHLIGHTS

ఇంటర్నేషనల్ కోడ్స్ తో కాల్స్ అందుకుంటున్న ఘటనలు విరివిగా చోటు చేసుకుంటున్నాయి

ఈ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త, అని సైబర్ క్రైం వింగ్ ప్రజలను హెచ్చరిస్తోంది

ఇప్పటికీ ఈ కాల్స్ కొందరికి వస్తున్నట్లు గుర్తించారు

ఇప్పుడు దేశమంతటా వాట్సాప్ యూజర్లు ఇంటర్నేషనల్ కోడ్స్ తో కాల్స్ అందుకుంటున్న ఘటనలు విరివిగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని గురించి కొందరు వాట్సాప్ యూజర్లు సైబర్ క్రైం సెక్యూరిటీ కి కంప్లైట్స్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ కాల్స్ కొందరికి వస్తున్నట్లు గుర్తించారు. అందుకే, వాట్సాప్ లో అంతర్జాతీయ కోడ్స్ నుండి వస్తున్నా ఈ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త, అని సైబర్ క్రైం వింగ్ ప్రజలను హెచ్చరిస్తోంది. 

ఏమిటి ఈ ఇంటర్నేషనల్ కాల్స్?

వాట్సాప్ లో అంతర్జాతీయ కోడ్స్ నుండి కాల్స్ వస్తున్నట్లు చాలా మంది యూజర్లు వాట్సాప్ మరియు సైబర్ క్రైమ్ కు రిపోర్ట్ చేశారు. అసలు ఏమిటి ఈ ఇంటర్నేషనల్ కాల్స్, అంటే ఇతర దేశాల కోడ్స్ (ఉదా: +84,+62) నుండి వచ్చే కాల్స్ ను ఇంటర్నేషనల్ కోడ్స్ కాల్స్ అని అంటారు. ఈ కాల్స్ ఇతర దేశ కోడ్స్ వచ్చే కాల్స్ మరియు ఇంటర్నేషనల్ కాల్స్ గా గుర్తించ బడతాయి. 

ఈ ఇంటర్నేషనల్ కాల్స్ ప్రమాదం ఏమిటి?

వాస్తవానికి, వాట్సాప్ నుండి యూజర్లు అందుకుంటున్న ఇంటర్నేషనల్ కోడ్ కాల్స్ ఆ దేశాల నుండి కాకుండా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP) ద్వారా వస్తున్నట్లుగా గుర్తించారు. అంటే, ఈ టెక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా ర్యాండమ్ గా ఈ దేశ కోడ్ తో అయినా సేల్ వాట్సాప్ కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కాల్స్ స్కామ్ కాల్స్ గా గుర్తిస్తున్నారు. 

ఈ కాల్స్ ని ఎలా అరికట్టాలి?

ప్రస్తుతం వాట్సాప్ మరియు ప్రభుత్వం ఈ కాల్స్ ను అరికట్టే పనిలో పడ్డాయి. అయితే, మీరు మీ ఫోన్ డేటాని కాపాడుకోవాలంటే, లేదా మోసపోకుండా ఉండాలంటే, ఈ ఫోన్ లో వచ్చే ఇంటర్నేషనల్ కోడ్ కాల్స్ ను లిఫ్ట్ చేయకుండా ఉండాలి. అంతేకాదు, ఆ నంబర్ లను వాట్సాప్ నుండి బ్లాక్ చేసి రిపోర్ట్ చెయ్యడం మంచిది. 

ఇంటర్నేషల్ కాల్స్ ను గుర్తించడం ఎలా?

ఈ కాల్స్ మన దేశ కోడ్ +91 కాకుండా ఇతర దేశాల కోడ్స్ ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం, +84 (వియాత్నం), +62 (ఇండోనేషియా), +1 (అమెరికా), +977 (నేపాల్) మరియు మరిన్ని కోడ్స్ నుండి కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు. మీరు సేవ్ చేసుకొని లేదా మీకు తెలియని ఇంటర్నేషనల్ కోడ్స్ నుండి కాల్స్ అందుకుంటే వెంటనే కట్ చేసి రిపోర్ట్ చేయడం ఉత్తమం. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :