అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఖాతాధారుల కోసం WhatsApp LIC Service లను ప్రారంభించింది. కస్టమర్లకు ఇంటి వద్దకే సేవలను ఫింగర్ టిప్స్ పైన మొబైల్ లోకి తీసుకు వచ్చేసింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ఖాతాదారులకు మరింత వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన సేవలను అందిచడానికి వీలవుతుంది. వాస్తవానికి, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఖాతాదారులను కలిగి ఉన్న ఎల్ఐసి సంస్థ విస్తారమైన సేవలను అందిస్తూ ఖాతాదారుల మన్నలను అందుకుంది.
ఈ వాట్సాప్ ఎల్ఐసి సర్వీస్ అనేది ఖాతాధారులకు కావలసిన సమాచారం కోసం తీసుకురాబడిన సర్వీస్. ఇది ఖాతాధారుల వారి పాలసీకి సంబంధించి పూర్తి సంచారాన్ని అందించే మార్గంగా ఉంటుంది. అయితే, ఈ సర్వీస్ కోసం ఖాతాధారులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అధికారిక వెబ్సైట్ లో వారి ఖాతా వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
Also Read : Realme 11 Pro 5G పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్.!
నమోదు చేసుకున్న తరువాత LIC కస్టమర్లు వాట్సాప్ ఎల్ఐసి సర్వీస్ నెంబర్ అయిన 8976862090 నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. అంతే, మీరు ఈ మెసేజ్ పెట్టిన తరువాత పాలసీధారులకు ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ద్వారా అందించే సర్వీస్ ల లిస్ట్ ను అందిస్తుంది. వాస్తవానికి, ఈ సర్వీస్ డిసెంబర్ 2022 నుండే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సర్వీస్ నుండి మొత్తం 11 సర్వీస్ లను లిస్ట్ చేసి సేవలు అందిస్తోంది.