WhatsApp LIC Service: వాట్సాప్ ద్వారా సింపుల్ గా అన్ని సర్వీస్ లు అందుకోండి.!
ఖాతాధారుల కోసం WhatsApp LIC Service లను ప్రారంభించింది
సేవలను ఫింగర్ టిప్స్ పైన మొబైల్ లోకి LIC తీసుకు వచ్చేసింది
ఖాతాధారులకు కావలసిన సమాచారం కోసం తీసుకురాబడిన సర్వీస్
అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఖాతాధారుల కోసం WhatsApp LIC Service లను ప్రారంభించింది. కస్టమర్లకు ఇంటి వద్దకే సేవలను ఫింగర్ టిప్స్ పైన మొబైల్ లోకి తీసుకు వచ్చేసింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా ఖాతాదారులకు మరింత వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన సేవలను అందిచడానికి వీలవుతుంది. వాస్తవానికి, దేశవ్యాప్తంగా అత్యధికంగా ఖాతాదారులను కలిగి ఉన్న ఎల్ఐసి సంస్థ విస్తారమైన సేవలను అందిస్తూ ఖాతాదారుల మన్నలను అందుకుంది.
WhatsApp LIC Service
ఈ వాట్సాప్ ఎల్ఐసి సర్వీస్ అనేది ఖాతాధారులకు కావలసిన సమాచారం కోసం తీసుకురాబడిన సర్వీస్. ఇది ఖాతాధారుల వారి పాలసీకి సంబంధించి పూర్తి సంచారాన్ని అందించే మార్గంగా ఉంటుంది. అయితే, ఈ సర్వీస్ కోసం ఖాతాధారులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అధికారిక వెబ్సైట్ లో వారి ఖాతా వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
Also Read : Realme 11 Pro 5G పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్.!
నమోదు చేసుకున్న తరువాత LIC కస్టమర్లు వాట్సాప్ ఎల్ఐసి సర్వీస్ నెంబర్ అయిన 8976862090 నెంబర్ కు ‘Hi’ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. అంతే, మీరు ఈ మెసేజ్ పెట్టిన తరువాత పాలసీధారులకు ఎల్ఐసి వాట్సాప్ సర్వీస్ ద్వారా అందించే సర్వీస్ ల లిస్ట్ ను అందిస్తుంది. వాస్తవానికి, ఈ సర్వీస్ డిసెంబర్ 2022 నుండే అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సర్వీస్ నుండి మొత్తం 11 సర్వీస్ లను లిస్ట్ చేసి సేవలు అందిస్తోంది.