iPhone 14 లో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ గురించి తెలుసా.!

iPhone 14 లో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ గురించి తెలుసా.!
HIGHLIGHTS

Apple కొత్త iPhone 14 మోడల్స్ లో కొత్త 'డైనమిక్ ఐల్యాండ్' ను పరిచయం చేసింది

ఈ కొత్త డైనమిక్ ఐల్యాండ్ గురించి మనకు తెలియని సంగతులను యాపిల్ వెల్లడించింది

యాపిల్ ఈ మోడల్స్ లో పాత నోచ్ స్థానంలో కొత్త పిల్-ఆకారపు కట్-అవుట్‌ను ప్రవేశపెట్టింది

యాపిల్ ఇండియాలో iPhone 14 సిరీస్ నుండి నాలుగు కొత్త ఫోన్లను ప్రకటించింది. వీటిలో, iPhone 14 సిరీస్ నుండి రెండు మరియు iPhone 14 Pro నుండి రెండు ఫోన్లను ఆవిష్కరించింది. ఇందులో,  సెప్టెంబర్ 7 న యాపిల్ ప్రకటించిన కొత్త iPhone 14 మోడల్స్ లో కొత్త 'డైనమిక్ ఐల్యాండ్' ను పరిచయం చేసింది. ఈ కొత్త డైనమిక్ ఐల్యాండ్ గురించి మనకు తెలియని సంగతులను యాపిల్ వెల్లడించింది. మరి సరికొత్తగా తీసుకొచ్చిన డైనమిక్ ఐల్యాండ్ గురించి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.       

యాపిల్ ఈ మోడల్స్ లో పాత నోచ్ స్థానంలో కొత్త పిల్-ఆకారపు కట్-అవుట్‌ను ప్రవేశపెట్టింది. iPhone 14 Pro కొనేవారు .. 'డైనమిక్ ఐల్యాండ్' కి హలొ చెప్పవచ్చు. ఈ డైనమిక్ ఐలాండ్ ఒక చిన్న నోటిఫికేషన్ హబ్‌గా ఉపయోగపడుతుంది మరియు ఐఫోన్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. డైనమిక్ ఐలాండ్ అనేది ప్రో ఐఫోన్ 14 మోడల్‌లలో పిల్-ఆకారపు కటౌట్ చుట్టూ ఉన్న షేప్‌షిఫ్టింగ్ బ్లాక్ పిల్. ఇది వినియోగదారులు కాల్ స్వీకరిస్తున్నట్లయితే వారికి తెలియజేస్తుంది.

డైనమిక్ ఐలాండ్ ఒక మినీ కంట్రోల్ సెంటర్ గా కూడా పనిచేస్తుంది, మ్యూజిక్ కంట్రోల్స్ మరియు బ్యాటరీ శాతం ఇన్ఫర్మేషన్ వంటి అవసరమైన వాటికి యాక్సెస్ ఇస్తుంది. ఈ డైనమిక్ ఐలాండ్ లోపల, 31 శాతం చిన్న TrueDepth కెమెరా సిస్టమ్ మరియు రీ-ఇంజనీర్డ్ ప్రాక్సిమిటీ సెన్సార్‌ను యాపిల్ జతచేసింది. అయితే, iPhone 14 కొనేవారు మాత్రం ఈ "డైనమిక్ ఐలాండ్" నాచ్‌ని పొందలేరు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo