పెరిగిన Pi Coin గిరాకీ: ఈ కాయిన్ ఏమిటి, దాని కథ ఏమిటో తెలుసా.!

బ్లాక్ చైన్ ద్వారా నడిచే డిజిటల్ కరెన్సీ కి డిమాండ్ బాగా పెరిగిపోతోంది
ట్రేడింగ్ కోసం ఉపయోగపడే Pi Coin ను Pi Network రెండు సంవత్సరాల క్రితం పరిచయం చేసింది
ఇప్పుడు ఈ కాయిన్ ను మెయిన్ నెట్ కి పరిచయం చేసింది
ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ చైన్ ద్వారా నడిచే డిజిటల్ కరెన్సీ కి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఇదే పంధాలో వచ్చిన బిట్ కాయిన్ ఇప్పటికే ఎనలేని కీర్తిని మరియు లాభాలను తెచ్చి పెట్టింది. అందుకే, ట్రేడింగ్ కోసం ఉపయోగపడే Pi Coin ను Pi Network రెండు సంవత్సరాల క్రితం పరిచయం చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ కాయిన్ కేవలం టెస్ట్ నెట్ కి మాత్రమే పరిమితం అయ్యింది. అక్కని ఇప్పుడు ఈ కాయిన్ ను మెయిన్ నెట్ కి పరిచయం చేసింది. ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న వారు కోటి మందికి పైగానే ఉన్నారు.
Pi Coin ఎలా వచ్చింది?
2019 లో స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్స్ ఈ Pi Network ని ప్రారంభించారు. అంతేకాదు, ఈ నెట్ వర్క్ ఇప్పుడు గ్రౌండ్ షేకింగ్ బ్లాక్ చైన్ ఇనీషియేటివ్ గా గుర్తించబడింది. ముందుగా వచ్చిన క్రిప్టో కరెన్సీ మాదిరిగా కాకుండా ఒక యాప్ ద్వారా మొబైల్ ఫోన్ లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అందుకోవడమే లక్ష్యంగా ఈ Pi నెట్ వర్క్ ను తీసుకు వచ్చారు.
Pi Coin ధర వివరాలు లైవ్ అప్డేట్
ఈ Pi కాయిన్ ప్రైస్ లైవ్ అప్డేట్ OKX, Bitget, CoinDCX, gate.io వంటి మరిన్ని ప్రధాన క్రిప్టో కరెన్సీ యాప్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ కాయిన్ 1.70 నుంచి 1.78 డాలర్స్ వరకు ట్రేడ్ అవుతోంది.
Also Read: లేటెస్ట్ JVC QLED Smart Tv పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
ఈ Pi కాయిన్ ఎలా పని చేస్తుంది?
బిట్ కాయిన్ తో పోలిస్తే ఈ Pi కాయిన్ సులభమైన పద్ధతిలో పని చేస్తుంది. ఎందుకంటే, బిట్ కాయిన్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ పై ఆధారపడి ఉంటే, Pi కాయిన్ మాత్రం కమ్యూనిటీ ట్రస్ట్ పై ఆధారపడి పని చేస్తుంది. యూజర్లు నెట్ వర్క్ కంట్రిబ్యూషన్, డైలీ విజిట్స్, యూజర్ సర్కిల్ ను పెంచుకోవడం వంటి వాటిపై రివార్డ్స్ అందుకుంటారు. అయితే, ఇవన్నీ చేయడానికి ముందుగా యూజర్ తన KYC వెరిఫికేషన్ ప్రోసెస్ ను పూర్తి చేసి ఉండాలి.
ఇందులో యూజర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ కాయిన్స్ మైనింగ్ ప్రారంభించవచ్చు. సర్కిల్ క్రియేట్ చేయడం ద్వారా మరింత వేగంగా కాయిన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, యూజర్లు చాట్స్, పోల్స్ మరియు వారి రిఫరల్ కోడ్ షేర్ చేయడం ద్వారా కూడా ఈ కాయిన్స్ అందుకోవచ్చు.