RBI రిలీజ్ చేసిన డిజిటల్ రూపీ లేదా e-Rupee అంటే ఏమిటి.!
RBI) భారతీయ రూపాయికి తీసుకువచ్చిన డిజిటల్ వెర్షన్ ఈ డిజిటల్ రూపీ
డిజిటల్ రూపీ లేదా e-Rupee ని తీసుకురావాలని 2017 లోనే ప్రతిపాదించారు
e-Rupee పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా లాంచ్ చేయబడింది
భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారతీయ రూపాయికి తీసుకువచ్చిన డిజిటల్ వెర్షన్ ఈ డిజిటల్ రూపీ లేదా e-Rupee. దీని ద్వారా అంతర్జాతీయం కరెన్సీగా ఎక్కువ ఉపయోగిస్తున్న US డాలర్ కు పోటీగా లేదా ప్రత్యామ్న్యాయంగా కూడా ఈ డిజిటల్ రూపీ లేదా e-Rupee ని అంతర్జాతీయ మార్కెట్ లో వాడుకలోకి తీసుకురావాలని యోచిస్తోంది. వాస్తవానికి, డిజిటల్ రూపీ లేదా e-Rupee ని తీసుకురావాలని 2017 లోనే ప్రతిపాదించారు. అయితే, ఎట్టకేలకు ఇది 2022 లో సాధ్యపడింది. అయితే, ప్రస్తుతానికి ఈ డిజిటల్ రూపీ లేదా e-Rupee పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా లాంచ్ చేయబడింది. ఈ డిజిటల్ రూపీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు మరియు భారతదేశంలోని అన్ని ఇతర బ్యాంకులకు మధ్య డిజిటల్ కరెన్సీ ఇ-రూపాయి యొక్క పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)గా పిలవబడే ఈ డిజిటల్ రూపాయి (ఇ-రూపాయి) మీ వాలెట్‌లోని కాగితం నోట్లు లేదా నాణేల మాదిరిగానే అదే విలువను కలిగి ఉంటుంది. అయితే, ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. క్యాష్ లేదు డిజిటల్ ఫార్మాట్ లో డబ్బును పొందడం మరియు ఉపయోగించడం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న అన్ని వాడుక పద్ధతులు ఈ e-Rupee కారణంగా అదృశ్యం కావని మాత్రం గుర్తుంచుకోండి. అంటే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న అన్ని క్యాష్ ఉపయోగ పద్ధతులను కూడా అలాగే కొనసాగుతాయి.
మరి ఈ e-Rupee తో ఉపయోగం ఏమిటి?
డబ్బును ముద్రించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని మరియు ఎల్లవేళలా మీ జేబులో పెట్టుకొని తీసుకెళ్లడం వల్ల కొన్నిసార్లు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, ఈ డిజిటల్ రూపాయితో ఇటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనికోసమే, RBI తో నేరుగా చేసే కొన్ని సెటిల్మెంట్ లేదా సంబంధిత విషయాల కోసంఈ CBDC లేదా డిజిటల్ రూపాయికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.