Wedding Invitation Scam: కొత్త నెంబర్ నుంచి పెళ్లి కార్డు, కట్ చేస్తే అకౌంట్ ఖాళీ.!

Updated on 13-Nov-2024
HIGHLIGHTS

Wedding Invitation Scam కొత్త వల అని నిపుణులు చెబుతున్నారు

కొత్త స్కామ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు

APK ఫైల్స్ పంపించి యూజర్ల డేటా ని కొల్ల గొట్టే ప్రయత్నం చేస్తున్నారు

Wedding Invitation Scam ఇప్పుడు వాట్సాప్ యూజర్ల కోసం వేస్తున్న కొత్త వల అని నిపుణులు చెబుతున్నారు. 2024 కార్తీక మాసంలో లక్షల కొద్దీ పెళ్ళిళ్ళు ఖాయం అయ్యాయి. ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతామున్నాయని న్యూస్ ఛానల్స్ లెక్కలు వేసి చెబుతున్నాయి. ఇంకేముంది స్కామర్లు ఇదే ఛాన్స్ అనుకున్నారో ఏమో, కొత్త స్కామ్ కు తెర లేపారు. ఈ కొత్త స్కామ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త స్కామ్ ఏమిటో ఈ స్కామ్ తో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Wedding Invitation Scam

పెళ్ళి కి పిలవడానికి ఇప్పుడు అందరూ వాట్సాప్ నే ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఇంటికి వెళ్లి పెళ్ళి కార్డులు ఇవ్వడం రివాజు అయితే, ప్రస్తుతం బిజీ లైఫ్ కు అలవాటు పడిన ప్రజలు సింపుల్ గా వాట్సాప్ నుంచి కార్డ్స్ పంపించి పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు.

సరిగ్గా ఇదే విషయాన్ని స్కామర్లు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే, పెళ్లి కార్డు ముసుగులో APK ఫైల్స్ పంపించి యూజర్ల డేటా ని కొల్ల గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఇలా చేయడం చాల ఈజీగా అయిన విషయం అని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే,ఎవరైనా కెళ్ళి కార్డ్ పంపిస్తే, ఆ కార్డ్ ఎవరు పంపారో అని ఆలోచించకుండా, ఇన్విటేషన్ ను చేసే తొందరలో ఆ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటారు. ఇంకేముంది, ఈ కార్డు ముసుగులో APK డౌన్ లోడ్ అయిపోతుంది. ఎందుకంటే, స్కామర్లు ఈ విధంగా ఫైల్స్ ను ముందే సెట్ చేసి పంపిస్తారు.

ఈ విధంగా యూజర్ కు తెలియకుండా APK ఫైల్స్ ను డౌన్ చేసిన తర్వాత అందులోని వైరస్ యూజర్ డేటాని తస్కరించడమే కాకుండా యూజర్ యొక్క సెక్యూర్ డేటాని సైతం స్కామర్ లకు చేరవేస్తుంది.

Also Read: Jio best Plan: మూడు నెలలు ఎంటర్టైన్మెంట్ అందించే జియో బెస్ట్ ప్లాన్.!

మరి ఈ స్కామ్ లేదా స్కామర్స్ నుంచి ఎలా తగ్గించుకోవాలి?

స్కామర్లు ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ చేయడానికి ఉపయోగించే ఏకైక అస్త్రం APK ఫైల్స్ ను వెడ్డింగ్ కార్డ్ ముసుగులో పంపించడం. యల్ చేయాలంటే, కొత్త నెంబర్ నుంచి ఈ వెడ్డింగ్ కార్డు ను పంపిస్తారు. అందుకే, మీకు తెలియని కొత్త నెంబర్ నుంచి ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్ డౌన్ లోడ్ చేసుకోమని వస్తే, ఆ పని చేయకండి.

కొత్త నెంబర్ నుంచి వచ్చే మెసేజ్, ఫైల్స్ లేదా మరింకేదైనా విషయాలు మీకు హాని కలిగించవచ్చు. ఈ స్కామ్ విషయం గుర్తుంచుకోండి మరియు ఈ పెళ్లిళ్ల సీజన్ లో మరింత జాగ్రత్త వహించండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :