ఇద్దరు ఇండియన్ కామర్స్ గ్రాడ్యుయేట్లు సరికొత్త ఐడియా తో వచ్చారు. దీని పేరు 'WiFi Trash Bin'. ప్రతీక్ అండ్ రాజ్ పరిసరాలను శుభ్రంగా ఉండాలంటే ఇలాంటి వినూత్నమైనవి రావాలి అని వాళ్ల ఐడియా ను స్టార్ట్ చేసారు.
మీ దగ్గరలోని డస్ట్ బిన్ లో ట్రాష్ ను డంప్ చేస్తే, డస్ట్ బిన్ మీకు ఒక unique కోడ్ ఇస్తుంది. దానితో ఫ్రీగా WiFi ను పొందగలరు. NH7 అని పిలవబడే వీకెండర్ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గోనప్పుడు ఈ ఇద్దరికీ ఆ పార్టీ లో నెట్వర్క్ లేకపోవటం వలన కాల్స్ పనిచేయక స్నేహితులను వెతకటానికి 6 గంటలు పట్టింది అట.
దానికి తోడూ ఆ పార్టీ అన్ లిమిటెడ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ కారణంగా garbage ఎక్కువుగా తయారు అయ్యింది. ఈ రెండు సంఘటనలు తో WiFi ట్రాష్ బిన్ కాన్సెప్ట్ పుట్టింది వాళ్లకు.
ఇప్పటి వరకూ ఈ సెల్ఫ్ ఫండింగ్ ప్రాజెక్ట్ MTS నెట్వర్క్ నుండి సపోర్ట్ అందుకుంటుంది. డిల్లీ, కోల్కతా మరియు బెంగుళూరు లో జరుగుతున్న డిఫరెంట్ వీకెండర్ ఫెస్టివల్స్ లో ఇది సక్సెస్ అయ్యింది.
GAIL మరియు ఈ ఐడియా ను అందుబాటులోకి తెచ్చిన ప్రతీక్ అండ్ రాజ్ లకు మధ్యన టోటల్ ప్రోసెస్ పై మంతనాలు కూడా జరుగుతున్నాయి. ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం అందరికీ అవసరం లా మారింది కాబట్టి ఇది సీరియస్ గా ఆపరేషనల్ మోడ్ లోకి మిగిలన ప్రదేశాలలో వస్తే, క్లిన్ ఇండియాకు మంచి ఐడియా అని చెప్పవచ్చు దీనిని.