WannaCry దీని ప్రభావం తో సిస్టమ్స్ లాక్ అయ్యాయి
మీ కందరికి బాగా ప్రపంచం మొత్తం దేని గురించి బాధపడుతుందో అదే WannaCry దీని ప్రభావం తో సిస్టమ్స్ లాక్ అయ్యాయి. తాజాగా ఈ వైరస్ వాట్సప్ మీద కూడా వచ్చేసింది.ఇప్పుడు ఒక మెసేజ్ రూపం లో ఈ ప్రమాదం పొంచి వుంది.
మీ కందరికీ తెలుసు వాట్సప్ సాధారణంగా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, అయితే ఆ కలర్ కాకుండా ఇంకా రెడ్ బ్లూ ఎల్లో వంటి రంగుల్లోనూ ఇప్పుడు ఓ లింక్ కనిపిస్తుంది. ఇది వాట్సప్ కొత్త ఫీచర్ దీనిని ఇలా డౌన్లోడ్ చేయాలి అందుకు లింక్ క్లిక్ చేయండి అని ఉంటుంది ఆ మెసేజ్ లో ,బాగా వుంది కదా అనిదాని మీద క్లిక్ చేస్తే అంతే . అలా లింక్ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఉన్న వాట్సప్ గ్రూప్‌లు అన్నింటిలోనూ ఆ మెసేజ్ యూజర్‌కు తెలియకుండానే పోస్ట్ అవుతోంది
దీంతో చాలా మందికి ఆ మెసేజ్ వైరల్‌లా చేరుతుంది. ఆ తరువాత పనికి రాని యాడ్‌వేర్ యాప్స్ అన్నీ ఫోన్‌లలో వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. దీంతో వైరస్ ఫోన్లలో విస్తరించి డివైస్‌లను పనికిరాకుండా చేస్తోంది.