వోడాఫోన్ కొత్త కాన్సెప్ట్/ప్లాన్ ను తీసుకువచ్చింది. పేరు FLEX. ఇది ప్రీ పెయిడ్ users కోసం. వాయిస్, ఇంటర్నెట్ అండ్ sms అన్ని సెపరేట్ గా రీచార్జ్ లు చేసుకునే అవసరం లేకుండా సింగిల్ payment/charge కు ఇస్తుంది ఈ కాన్సెప్ట్
దీని ద్వారా 25% సేవింగ్స్ అవుతాయి అని తెలిపింది వోడాఫోన్. ఈ కాన్సెప్ట్ లో ప్లాన్స్ ఉన్నాయి. అన్నిటికీ validity మాత్రం 28 days.
FLEX అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డబ్బులు కు బదులు FLEX deduct అవుతాయి మీ వాడుకకు. అంతా FLEX కౌంట్ లో ఉంటుంది. FLEX ఇక్కడ మనీ currency లా వ్యవహరిస్తుంది.
1 FLEX = 1MB ఇంటర్నెట్(4G/3G/2G) తో సమానం.
1 FLEX = ఒక SMS
1 FLEX = వన్ మినిట్ incoming కాల్(రోమింగ్ లో)
2 FLEX = వన్ మినిట్ లోకల్/STD కాల్స్ లేదా వన్ మినిట్ రోమింగ్ outgoing కాల్.
టోటల్ గా FLEX ప్లాన్స్ నాలుగు ఉన్నాయి…క్రింద ఉన్నవి కాకుండా ఇంకా తక్కువ లో కూడా ఉన్నాయి FLEX ప్లాన్స్. రీజియన్ వైజ్ గా ఇవి మరే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఒక ప్లాన్ లో మిగిలిన పోయిన FLEX తరువాత ప్లాన్స్ లోకి ఫార్వార్డ్ చేసుకోగలరు. సో దీనిపై మరింత లోతుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే…
ఫర్ eg: మీరు 119 rs రీచార్జ్ చేస్తే 325 FLEX వస్తుంది. అంటే 325MB ఇంటర్నెట్ వస్తుంది. కాని మీరు ఇదే 325 FLEX ను ఇంటర్నెట్ ఒకటే వాడనవసరం లేదు, పైన చెప్పిన కౌంట్ ప్రకారం sms లేదా కాల్స్ అయినా వాడుకోగలరు అదే 325 FLEX కు. అంటే ఒకే రీచార్జ్ కు ఇంటర్నెట్, కాల్స్ అండ్ sms కూడా ఇస్తుంది.
అంటే ఒకే FLEX కు(రీచార్జ్ కు) మీకు ఏది అవసరమో అది వాడుకోగలరు ఎటువంటి అదనపు FLEX(రిచార్జ్స్) లేకుండా. క్రింద పిక్స్ చూడండి..