4G అన్లిమిటెడ్ డేటా 33 రూపాయలలో ….

Updated on 29-Mar-2018

ఎయిర్టెల్ తరువాత, వోడాఫోన్ ఇప్పుడు తన  వినియోగదారులకు 33 రూపాయలలో అపరిమిత డేటా ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ను సూపర్ నైట్ ఇంటర్నెట్ ప్యాక్ పేరుతో ప్రవేశపెట్టింది.వోడాఫోన్ రూ .33 యొక్క సూపర్ నైట్ ఇంటర్నెట్ ప్యాక్ లో  4 జి స్పీడ్ తో అపరిమిత డేటాను పొందవచ్చు , దీని వాలిడిటీ  రాత్రి 1AM నుంచి 6AM  వరకు ఉంటుంది. ఈ సమయంలో, యూజర్ అపరిమిత 4G డేటా పొందుతారు.

కంపెనీ  ఒక గంట వాలిడిటీ సూపర్ అవర్  ప్యాక్  కూడా ప్రవేశపెట్టింది, దీనిలో వినియోగదారులు 3G / 4G వేగంతో అపరిమిత డేటాను పొందుతారు. ఎయిర్టెల్ మాదిరిగా, వొడాఫోన్ కూడా ఈ ప్లాన్ ని ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మాత్రమే పరిచయం చేసింది.

మీరు ఒక వోడాఫోన్ కస్టమర్ అయితే మీ నెంబర్ పై లో ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ చెక్  చేయాలనుకుంటే, మీరు MyVodafone యాప్ మరియు కంపెనీ  యొక్క అధికారిక వెబ్సైట్ నుండి మీ నెంబర్ లో ఆఫర్ ని చెక్  చేయవచ్చు. 121 నంబర్లను డయల్ చేసి , మీరు బెస్ట్  ఆఫర్ గురించి కూడా తెలుసుకోవచ్చు.

 

 

 

Connect On :