Vodafone రూ. 399 ప్లాన్ లో అపరిమిత ఆఫర్ , 200 GB డేటా లాభం….

Updated on 07-Feb-2018

కొంతకాలం నుంచి  టెలికాం కంపెనీలు వారి ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం టారిఫ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు వారి పోస్ట్పెయిడ్ వినియోగదారులపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాయి. జియో మరియు ఎయిర్టెల్ తర్వాత, వోడాఫోన్ ఇండియా పోస్ట్పెయిడ్ వినియోగదారులు రెడ్ బేసిక్ ప్లాన్ ని  అప్గ్రేడ్ చేసింది . అప్గ్రేడ్ తర్వాత, ఈ ప్లాన్స్  అనేక ఆఫర్లతో వస్తాయి మరియు దీనిలో వినియోగదారులు 30 GB డేటా అదనంగా 200 GB రీసైకిల్  డేటా పొందుతారు. ఇప్పుడు రూ. 399 బేసిక్ రెడ్ ప్లాన్ ని  కంపెనీ అప్గ్రేడ్ చేసింది.

399 రూపీస్ వొడాఫోన్ యొక్క రెడ్ బేసిక్ పోస్ట్ పైడ్  ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్ తో వస్తుంది . వినియోగదారులు ఉచిత కాల్ (ఇన్కమింగ్ లోకల్ మరియు STD మరియు ఇన్కమింగ్ రోమింగ్) పొందుతారు యూజర్లు ప్రతిరోజు 250 నిమిషాలు, ఉచిత కాల్స్ వారానికి 1,000 నిమిషాలు పొందుతారు. ఇది కాకుండా, ఉచిత 100 SMS లోకల్  మరియు నేషనల్ రోజువారీ అందుబాటులో ఉంటాయి . దీనితో పాటు, వినియోగదారులు 30 GB / 3G / 4G డేటాను పొందుతారు. ఇంతకుముందు ఈ ప్లాన్  20 GB డేటాతో వచ్చింది, ఇది కంపెనీ 30 GB కి పెంచబడింది.Red బేసిక్ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల గురించి మాట్లాడితే వినియోగదారుని ఉపయోగించని డేటా  (200 GB వరకు) మిగిలి ఉన్న డేటా తదుపరి బిల్లింగ్ సైకిల్ లో చేర్చబడుతుంది. దీనితో పాటు, ప్రస్తుతం కంపెనీ యూజర్స్ కి  4,000 రూపాయల వోడాఫోన్ ప్లే సర్వీస్ కు సబ్స్క్రిప్షన్ ఇస్తుంది .

రూ. 399 ఈ ప్లాన్ మొదటి ఆరు నెలల కోసం అందుబాటులో ఉంటుంది, దీని తరువాత ధర  రూ .499  అవుతుంది. వోడాఫోన్ యొక్క ప్రీపెయిడ్ యూజర్లు మరియు ఇతర నెట్వర్క్ల వినియోగదారులు వోడాఫోన్ పోస్ట్పెయిడ్ కస్టమర్ గా  మారవచ్చు. వోడాఫోన్ రెడ్ కి  మారడానికి, యూజర్ తన ఫోన్ నుండి 199 డయల్ చేయాలి.

 

 

Connect On :