వొడాఫోన్ రూ.445, రూ.353, రూ.145 రేంజ్‌లలో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్

Updated on 16-May-2017
HIGHLIGHTS

. వీటిలో రూ.445 ప్లాన్‌ను 4జీ యూజర్లతో పాటు 3జీ యూజర్లు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు

 భారత  టెలికామ్  దిగ్గజాలలో   ఒకటైన వోడాఫోన్ సరికొత్త ప్లాన్స్  ను విడుదల  చేసిందని  సమాచారం . తాజాగా  వచ్చిన కొన్ని  రిపోర్ట్స్  చూస్తే కనుక  వొడాఫోన్ రూ.445, రూ.353, రూ.145 రేంజ్‌లలో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్ చేసినట్లు  తెలుస్తుంది. వీటిలో రూ.445 ప్లాన్‌ను 4జీ యూజర్లతో పాటు 3జీ యూజర్లు కూడా  చక్కగా  ఉపయోగించుకోవచ్చు .  కానీ మిగతా   రెండు ప్లాన్‌లు మాత్రం 3జీ యూజర్లకు మాత్రమే  అని సమాచారం 

4జీ  వినియోగదారులు  రూ.445 ప్లాన్‌లో 70  డేస్  వాలిడిటీ  లో  డైలీ  1జీబి 4జీ డేటా లభిస్తుంది.  మరియు , ఈ దేశం  లో ఎక్కడికైనా  అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

 రెండవ  ప్లాన్ రూ.353 ప్లాన్‌ లో  28 రోజుల పాటు  ఎక్కడికైనా  అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే  సౌకర్యం  కలదు.  మరియు  2జీబి 3జీ డేటా కూడా  పొందవచ్చు ఇక మూడవది . ఇక రూ.145 ప్లాన్‌ లో  28  డేస్  వాలిడిటీ  టైం  తో  వొడాఫోన్ టు వొడాఫోన్  చేసుకోవాటికి  కాల్స్  ఫ్రీ .  మరియు 1జీబి 3జీ డేటా కూడా పొందవచ్చును. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :