Phone Switch Off: డిసెంబర్ 20న ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చెయ్యాలట.!
స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ప్రపంచం స్థితిగతులే మారిపోయాయి
కొత్త ఆలోచనను అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చూస్తోంది
Phone Switch Off ఆలోచనతో ముందుకు వచ్చింది
స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ప్రపంచం స్థితిగతులే మారిపోయాయి. ఒక్కరితో ఒకరికి పరస్పర సంభందాలు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఏ వారధిగా మారింది. ఎదురుగా ఉన్న వారికి గుడ్ మార్నింగ్ చెప్పే సమయం లేకున్నా యావత్ ప్రపంచానికే గుడ్ మార్నింగ్ చెప్పేచేస్తున్నారు స్మార్ట్ ఫోన్ తో. అంతగా, ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ లు మనుషులను మార్చేశాయి. అయితే, ఇప్పుడు ఒక కొత్త ఆలోచనను అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చూస్తోంది. అదే, Phone Switch Off ఆలోచన మరియు దీనికోసం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.
Phone Switch Off
ప్రసుతం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఈ విషయం గురించి డాక్టర్లతో పాటు మానసిక నిపుణులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. దీనికి తగిన ఉపాయాలను చెబుతున్నా పాటించే వారు కరువయ్యారు. ఇది పసి పిల్లల పైన మరింత ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్ పైన గంటల కొద్ది గడుపుతున్న పిల్లలు ఉన్నారంటే అందరూ ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం.
అయితే, దీనికి సరైన మార్గంగా ఫోన్ స్విచాఫ్ ను మెల్ల మెల్లగా అలవాటు చేసుకోవాలని నిపుణుల సూచన మేరకు దీనిపైన ద్రుష్టిసారించిన వివో కొత్త ఆలోచనతో ముదుందు వచ్చింది. అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ vivo ఒక కొత్త ఆలోచనను యూజర్ల తీసుకు వచ్చింది. అదేమిటంటే, 2023 డిసెంబర్ 20వ తేదీని ఫోన్ స్విఛ్ ఆఫ్ తేదీగా ప్రకటించింది. పూర్తిగా రోజు మొత్తం స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా స్విచ్ చేయడం కష్టం కాబట్టి ఒక గంట ఫోన్ ను స్విచ్ ఆఫ్ చెయ్యాలని తన యూజర్లను కోరింది.
2023 డిసెంబర్ 20వ తేదీ రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకూ వివో యూజర్లు అందరూ కూడా వారి స్మార్ట్ ఫోన్ లను పూర్తిగా స్విచ్ ఆఫ్ చెయ్యాలని కోరింది. హెల్త్ & సైన్స్ రైటర్ కేథరీన్ ప్రైస్ భాగస్వామ్యంతో వివో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Also Read : Smart Tv: 25 వేలకే సేల్ అవుతున్న బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీలు.!
ఫోన్ స్విచ్ ఆఫ్
వాస్తవానికి, స్మార్ట్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ గురించి వివో గత కొంత కాలంగా యాడ్స్ ను కూడా తీసుకు వచ్చింది. పిల్లకు క్వాలిటీ టైమ్ అందించాలంటే వారితో ఉన్నపుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచి ఆలోచన అనే విధంగా ఈ యాడ్స్ ను రూపొందించింది. టెక్నాలజీని సరైన పద్దతిలో ఉపయోగించేలా కృషి చేస్తోంది వివో కంపెనీ.