వినాయక చవితి 2024 పండుగ వచ్చేసింది మరియు ఈ పండుగ సందర్భంగా మీకు ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడానికి మీకు సరికొత్త మార్గాలు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు వాట్సాప్ లో విషెస్ చెప్పడానికి ఇమేజ్ లను క్రియేట్ చేయాల్సి వచ్చేది. అయితే, AI పుణ్యమా అని అన్ని పనులు చిటికెలో ఇట్టే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో శుభాకాంక్షలు సరికొత్తగా ఎలా షేర్ చేయాలో చూద్దాం.
మీ ప్రియమైన వారికి సరికొత్తగా శుభాకాంక్షలు తెలియ చేయడానికి అన్నింటికన్నా ముందుగా వాట్సాప్ చాలా సింపుల్ గా అందించిన Meta AI మాట్లాడవచ్చు. వాట్సాప్ లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ తో చాలా ఈజీగా మీ ప్రియమైన వారికి సరికొత్తగా శుభాకాంక్షలు సెర్చ్ చేసి పంపించవచ్చు. దీనికోసం మెటా ఎఐ చాట్ లోకి వెళ్లి వినాయక చవితి 2024 ఇమేజస్ మరియు విషెస్ కోట్స్ కోసం చెక్ చేయవచ్చు.
ఇక మరిన్ని AI ఆప్షన్ ల కోసం చూస్తే, గూగుల్ యొక్క Gemini మరియు చాట్ GPT లు కూడా సహాయం చేస్తాయి. ఈ రెండు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ లో చాలా సులభంగా విషెస్ ఐడియా లను పొందవచ్చు. దీనికోసం సింపుల్ గా Vinayaka Chavithi 2024 Wishes లేదా Ganesh Chaturthi 2024 Wishes అని అందిస్తే సరిపోతుంది. వెంటనే మీరు గుట్టల కొద్దీ ఐడియాలు మరియు సరికొత్త విషెస్ ను పొందుతారు. జెమినై నుంచి నేను అందుకున్న కొన్ని విషెస్ ను ఇక్కడ అందిస్తున్నాను మీరు చూడవచ్చు.
మీరు తెలుగులో కూడా విషెస్ ను పొందవచ్చు దీనికోసం ‘వినాయక చవితి 2024 శుభాకాంక్షలు’ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా చాట్ జిపిటి నుంచి కూడా పొందవచ్చు. ఇక ఇమేజెస్ విషయానికి వస్తే Canva, Unsplash, Pexels, Pixabay మరియు iStock వెబ్సైట్ ల నుంచి ఇమేజ్ లను పొందవచ్చు.
Also Read: Vivo T3 Ultra 5G లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫోన్ ఎలా ఉందంటే.!
Note : ఈ శీర్షిక మధ్యలో అందించిన ఇంగ్లీష్ విషెస్ లు Gemini నుంచి స్వీకరించడం జరిగింది. ఆ క్రెడిట్ జెమినై కి దక్కుతుంది.