OTT లో రిలీజైన విజయ్ దేవర కొండ ‘Liger’ మూవీ.!

OTT లో రిలీజైన విజయ్ దేవర కొండ ‘Liger’ మూవీ.!
HIGHLIGHTS

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'Liger' OTT లో రిలీజ్ అయ్యింది

విజయ్ దేవర కొండ 'Liger' ఓటిటీ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది

దక్షిణాది నాలుగు భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతుంది

విజయ్ దేవర కొండ (vijay devarakonda) హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'Liger' OTT లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో  ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న ఓటిటీ ప్రేక్షకులకు ఈ సినిమా సర్ ప్రైజ్ ఇచ్చింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా వాస్తవానికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. Disney+ Hotstar లైగర్ (Liger) సినియాను సైలెంట్ గా విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది.

వాస్తవానికి, గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ వచ్చిన వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. అయితే, డిస్నీ+ హాట్ స్టార్ మాత్రం ఎటువంటి ప్రమోషన్ లేదా ముందస్తు రిలీజ్ ట్రైలర్స్ లేదా టీజింగ్ లేకుండా లైగర్ సినిమాను ఈరోజు రిలీజ్ చేసింది. డిస్నీ+ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేసింది మరియు దక్షిణాది నాలుగు భాషల్లో ఈరోజు నుండి స్ట్రీమ్ అవుతుంది.

ఈ సినిమా విజయ్ దేవరకొండ కు బాలీవుడ్ డెబ్యూ మూవీ కాగా మొదటి చిత్రమే నిరాశపరిచింది. కానీ, ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరో ఇన్ గా నటించగా, రమ్య కృష్ణ విజయ్ తల్లి గా నటించారు. ఈ సినిమాలో లైగర్ కి మాష్టర్ గా రోనిత్ రాయ్ గొప్పగా నటించారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo