భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం కొత్త ఆన్లైన్ ప్లాట్ ఫామ్ Open Network for Digital Commerce (ONDC) ని లాంచ్ చేసింది. దేశంలోని పెద్ద పెద్ద ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లు మొదలుకొని చిన్న చిన్న వ్యాపారులను సైతం ఒక్క గూటికి చేర్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఈ ఓపెన్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను లాంచ్ లాంచ్ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ పైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ మరియు జొమేటో కంటే తక్కువ రేటుకే ఫుడ్ డెలివరీ అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఓపెన్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా వ్యాపారులు ఫుడ్ డెలివరీకి నేరుగా కస్టమర్లకు అందిస్తున్న కారణంగా ఫుడ్ మరింత చవకగా ఆఫ్ లైన్ రేటుకే లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫుడ్ డెలివరీ మరియు రేట్స్ గురించి కొంత మంది యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్స్ నుండిస్ ట్వీట్స్ కూడా చేస్తుండడం విశేషం.
స్విగ్గీ, జొమేటో మరియు ONDC రేట్స్ ను కంపేరిజన్ చేస్తూ, testbookdotcom వైస్ ప్రసిడెంట్ అయిన రవిసుతంజానీ కుమార్, తన ట్విట్టర్ అకౌంట్ నుండి చేసిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో స్విగ్గీ, జొమేటో మరియు ONDC రేట్స్ లో ఉన్న భారీ వ్యత్యాసాలను వివరంగా చూపించారు. ఇందులో, స్విగ్గీ, జొమేటో ఉన్న రేట్లలో సగం రేటుకే ONDC లో అదే ఫుడ్ ఐటమ్ లభిస్తున్నట్లు చూపించారు. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.