Reliance Jio ఫీచర్ ఫోన్ ని Rs 1,500 రిఫండబుల్ ధరలో కొనుగోలు చేయవచ్చు , కానీ వాడటానికి కొంత కంపెనీ నిబంధనలు మరియు షరతులు కూడా ఉన్నాయి.
JioPhone వెబ్సైట్ ఫై వున్న T&C పాలసీ ప్రకారం , JioPhone యూజర్స్ కి సంవత్సరానికి కనీసం 1,500 రూపాయలు లేదా మూడు సంవత్సరాల కు రూ .4,500 వరకు రీఛార్జ్ చేసుకోవాలిసి ఉంటుంది . అంటే ప్రతీ నెలా యూజర్స్ కి Rs 125 రీఛార్జ్ చేసుకోవాలిసి ఉంటుంది . అనలిస్ట్ ప్రకారం భారతీయ వినియోగదారు ఫోన్ యూజర్ యొక్క సగటు ఆదాయం నెలకు రూ. 100 లేదా తక్కువ ఉండొచ్చు ,జీయో యొక్క రూ 153 రీఛార్జి 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ట్రూ బాలన్స్ గత సంవత్సరం పరిశోధన ప్రకారం, భారతదేశంలో ప్రీపెయిడ్ యూజర్లు ఫోన్ లో ఒక నెలలో కనీసం 7.5 రోజుల వరకు 0 బ్యాలెన్స్ కలిగి వుంటారు .
ఒకవేళ JioPhone యూజర్స్ ఈ కనీస రీఛార్జ్ చేసుకోలేకపోయినట్లయితే , వారితో 'ఎర్లీ రిటర్న్ ' ఛార్జీ చేయబడుతుంది మరియు కస్టమర్ ముందస్తు అనుమతి లేకుండా,జియో ఫీచర్ ఫోన్ ని తిరిగి పొందడానికి హక్కు ఉంటుంది. జియో యొక్క ఎర్లీ రిటర్న్ ఫీ స్ట్రక్చర్ అనేది ఎవరైతే 3 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ కంటే ముందే ఈ ఫోన్ ని వాపస్ చేస్త్తారో వారికి అన్నమాట .
ఇవే కాక , Reliance Jio టర్మ్స్ అండ్ కండీషన్స్ ప్రకారం కంపెనీ వినియోగదారులు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, భాగస్వామ్యం చేయవచ్చు. అయితే
కంపెనీ ఎటువంటి వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీస్ తో భాగస్వామ్యం చేయదు. కంపెనీ కొంత టైం వరకు మాత్రమే ఈ సమాచారాన్ని తన వద్ద ఉంచుకుంటుంది మరియు దాని తరువాత అది డిలీట్ చేయబడుతుంది .
ప్రస్తుతం జియోఫోన్ కోసం ప్రీ ఆర్డర్ లేదు. అయితే రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ గతంలో ప్రీ బుకింగ్ అయిన డివైసెస్ ని దీపావళి కంటే ముందే డెలివరీ చేయనుంది .