UPI New Rules: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ ట్రాన్సక్షన్స్ ID ట్రాన్సక్షన్స్ ఆగిపోతాయి.. ఎందుకంటే.!

యూపీఐ అకౌంట్స్ పై NPCI కొత్త ఆంక్షలు విధించింది
1 ఫిబ్రవరి 2025 నుంచి కొన్ని యూపీఐ అకౌంట్స్ పై లావాదేవీలు నిలిచిపోయే అవకాశం
డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్స్ బలోపేతం చేయడానికి కొత్త నిర్ణయం
UPI New Rules: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ అకౌంట్స్ పై కొత్త ఆంక్షలు విధించింది. ఈ కొత్త ఆంక్షల ప్రకారం 1 ఫిబ్రవరి 2025 నుంచి కొన్ని ట్రాన్సక్షన్స్ ID ఐడి ల పై లావాదేవీలు నిలిచిపోయే అవకాశం వుంది. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్స్ ను మరింత సురక్షితం మరియు బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI తెలిపింది.
ఏమిటి ఈ UPI New Rules?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అనేది ఇన్స్టాంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టం. వేగవంతమైన మరియు సమర్థవంతమైన పేమెంట్ కోసం NPCI ఈ సిస్టం ను నిర్మించింది. ఇది మొబైల్ ఫోన్స్ ద్వారా ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కు సహాయం చేస్తుంది. ఈ విధానం ద్వారా బ్యాంకు లావాదేవీలు చాలా సులభంగా మార్చింది. ఈ సర్వీస్ కోసం బ్యాంక్ అకౌంట్ తో యూపీఐ ట్రాన్సక్షన్స్ ఐడి ని కలిగి ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ దీనికోసం తీసుకు వచ్చినదే.
ఇక అసలు విషయానికి వస్తే, యూజర్ కలిగి వున్న ట్రాన్సక్షన్స్ ఐడి లో ఏదైనా ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు కానివి) ను కలిగి ఉంటే 1 ఫిబ్రవరి 2025 నుంచి ఈ ట్రాన్సక్షన్స్ ఐడి తో చేసే ట్రాన్సాక్షన్స్ నిలిపివేయబడతాయి. వాస్తవానికి, NPCI ఈ విషయాన్ని 2025 జనవరి 9వ తేదీ విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడించింది. ఈ కొత్త రూల్ 1 ఫిబ్రవరి 2025 నుంచి అమల్లోకి వస్తుంది.
Also Read: Bose Sound సహకారంతో Noise కొత్త మాస్టర్ సిరీస్ పరిచయం చేస్తోంది.!
ఏ UPI ID లకు ఇబ్బంది కలుగుతుంది?
NPCI ప్రకారం, ఆల్ఫాన్యూమరిక్ లను కలిగి ఉన్న ట్రాన్సక్షన్స్ ఐడి లతో లావాదేవీలు నిలిచిపోతాయి. అంటే, @, # లేదా ! వంటి సంజ్ఞలు కలిగి ఉన్న ట్రాన్సక్షన్స్ ఐడి లతో చేసే ట్రాన్సాక్షన్స్ సిస్టం ద్వారా ఆటోమాటిగ్గా నిలిపి వేస్తుంది. కాబట్టి, ట్రాన్సక్షన్స్ ఐడి లో స్పెషల్ క్యారెక్టర్ కలిగిన హోల్డర్లు వారి అకౌంట్ లో ఉన్న ఆల్ఫాన్యూమరిక్ లను తొలగించవలసి ఉంటుంది.