5G ప్రియులే టార్గెట్ గా కొత్త స్కామ్. !

Updated on 08-Jan-2023
HIGHLIGHTS

ఇండియాలో మరొక కొత్త స్కామ్ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది

కొత్త స్కామ్ తో సొమ్ము చేసుంటున్నారు

ప్రజల్లో 5G పైన బాగా క్రేజ్ పెరిగింది

ఇండియాలో మరొక కొత్త స్కామ్ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని కొన్ని ప్రధాన నగరాలలో టెలికం కంపెనీలు వాటి 5G సర్వీస్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో, రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలికం కంపెనీలు ఉన్నాయి. అయితే, ఈ సర్వీస్ లను కొన్ని సిటీలలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాదు, 5G నెట్ వర్క్ లాంచ్ చేసిన సిటీ మరియు ప్రాంతాలను కూడా టెలికం కంపెనీలు వెల్లడిస్తున్నాయి. 4G కంటే చాలా రేట్ల వేగంతో ఇంటర్నెట్ స్పీడ్ అందుకునే అవకాశం ఉండటంతో, ప్రజల్లో 5G పైన బాగా క్రేజ్ పెరిగింది. అందుకే, ఇదే విషయాన్ని స్కామర్లు టార్గెట్ చేసుకొని కొత్త స్కామ్ తో  సొమ్ము చేసుంటున్నారు. ఈ కోత్త స్కామ్ ఏమిటో తెలుసుకుందామా.      

వాస్తవానికి, టెలికం కంపెనీలు 5G నెట్ వర్క్ ను దశల వారీగా ఒక్కొక్క నగరంలో లాంచ్ చేస్తున్నాయి మరియు త్వరలోనే దేశవ్యాప్తంగా తమ సర్వీస్ లను అంధుబాటులోకి తీసుకువచ్చే దిశగా సాగుతున్నాయి. కానీ, ప్రజల్లో అతిగా ఉన్న 5G క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో స్కామర్లు కొత్త మోసాలకు తెరలేపుతుతున్నారు. స్కామర్లు, 5G సర్వీస్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేసే ఈ మోసాలకు పాల్పడుతున్నారు. 

మీరు 5G నెట్ అవిర్క్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి, అని టెలికం కంపెనీల మాదిరిగా నమ్మబలుకుతూ లింక్స్ తో కూడిన SMS లను పంపిస్తున్నారు. ఈ లింక్ పైన క్లిక్ చేసే అమాయక ప్రజల పర్సనల్ డేటాతో పాటుగా బ్యాంక్ అకౌంట్ విరాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది, మీ వివరాలు అందుకున్న స్కామర్లు మీ అకౌంట్ మొత్తం ఖాళి చేసేస్తారు. 

వాస్తవానికి, మీరు 5G నెట్ వర్క్ కు మారాలంటే ఎటువాంటి లింక్ లేదా కొత్త SIM కార్డ్ ను ఆశ్రయించాల్సిన పనిలేదు. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న 4G SIM కార్డ్ పైన మీరు 5G నెట్ వర్క్ ను పొందవచ్చు. అంతేకాదు, 5G నెట్ వర్క్ లాంచ్ చేస్తున్న మరియు చేయనున్న ప్రాంతలలో వివరాలను కూడా టెలికం కంపెనీలు ప్రకటిసున్నాయి. అందుకే, ఇటువంటి మోసపూరితమైన మెసేజీలను నమ్మకండి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :