2019 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లు

Updated on 02-Jan-2019
HIGHLIGHTS

2018 సంవత్సరంలో, అనేక స్మార్ట్ ఫోనులు మార్కెట్ని ముంచెత్తాయి, మరి 2019 సంవత్సరంలో ఎటువంటి ఫోన్లు రానున్నాయి చూద్దాం.

కొత్త సంవత్సరం గురించి, స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేకమైన అంచనాలు సిద్ధంచేస్తోంది. 2018 సంవత్సరంలో, అనేక స్మార్ట్ ఫోనులు మార్కెట్ని ముంచెత్తాయి, మరి 2019 సంవత్సరంలో ఎటువంటి ఫోన్లు రానున్నాయి చూద్దాం.         

 1. గెలాక్సీ S10

 2019 ఫిబ్రవరిలో, శామ్సంగ్ దాని ప్రధాన ఫోన్ అయినటువంటి ,గెలాక్సీ S10 ని తీసుకురానున్నట్లు భావిస్తున్నారు .  5G మద్దతు కలిగివుండే విషయాన్నీ పక్కన పెడితే, ఈ  ఫోన్ యొక్క మూడు వేరియంట్లు రానున్నట్లు అంచనా : గెలాక్సీ S10, S10 లైట్, మరియు S10 ప్లస్.

ఈ మూడు ఫోన్లు కూడా ఒక పంచ్ హోల్  ఫ్రెంట్ కెమెరా తో, బెజెల్ -లెస్ డిస్ప్లేతో  రావచ్చని భావిస్తున్నారు.  గెలాక్సీ S10 మరియు S10 ప్లస్ రెండూ కూడా ట్రిపుల్-కెమెరా నిర్మాణానికి అనుగుణంగా ఉంటే, S10 లైట్ డ్యూయల్ కెమెరా సెటప్పుతో ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న కొన్ని నివేదికల ప్రకారం,  వెనుక నాలుగు-కెమెరాలతో ఒక ప్రత్యేక 5G వేరియంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

2. గూగుల్ పిక్సెల్ 3 లైట్

ఒక మిస్టీరియస్ మిడ్-రేంజ్ పిక్సెల్ డివైజ్, ఆన్ లైన్ లో చాలాసార్లు కనిపించింది. ఈ ఫోన్ సర్గో కోడ్నేమ్ తో  వచ్చింది, అయితే  ఇది పిక్సెల్ 3 లైట్ అయ్యేఅవకాశముందని  అందరూ భావిస్తున్నారు. చాలమంది  రెండర్స్, ఈ ఫోన్ డ్యూయల్ ఫ్రెంట్ కెమెరా సెటప్ మరియు వెనుక సింగల్ కెమెరాతో ఉంటుందని చెబుతున్నారు. డ్యూయల్  టోన్ గ్లాస్  డిజైన్ గురించి కూడా ఇందులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తగినంత వేగంతో పనిచేసే పసుపు రంగులో ఉన్న పవర్ బటన్ కూడా ఉంటుంది.

3. హువాయ్ P30

బార్సిలోనాలో జరగనున్న MWC 2019 లో Huawei P30 మరియు P30 ప్రోలను ప్రకటించవచ్చు హవావే. లీకైన ఈ ఫోన్లు రెండింటిలోకూడా ఒక వాటర్ డ్రాప్ నాచ్ ఉండనున్నట్లు వెల్లడయింది. కానీ P30 ప్రో ఒక క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది, ఇది ఒక TOF 3D సెన్సరుగా ఉంటుంది. అయితే, మరోవైపు బేసిక్ వర్షన్ అయినటువంటి  P30 ఫోన్ ఒక  ట్రిపుల్-కెమెరా డిజైనుతో ఉంటుంది.

4. నోకియా 9                                 

2019 సంవత్సరంలో, నోకియా కెమెరాల విభగంలో కొత్త పుంతలు తొక్కనుంది.  నోకియా,  వెనుకవైపు పెంటా-కెమెరా సెటప్పుతో, మొట్టమొదటి సరిగా నోకియా ఒక ఫోనును తీసుకురానున్నట్లు ప్రతుతం వస్తున్నా రూమర్లు మరియు రెండర్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ పొడవుగా ఉంటుంది మరియు 2019 చివరి వరకు ను విడుదల కానున్నట్లు వస్తున్నా రుమార్లు చెబుతానున్నాయి.  

5. OnePlus 5G

ఈ డిసెంబర్లో ముందుగా, OnePlus UK మరియు యూరోప్లకు 5G- ఎనేబుల్  డివైజ్ ను తయారు చేయనుంది. ఈ ఫోన్ మే 2019 లో ప్రారంభమవుతుంది మరియు లోపల 5G మోడెమ్ కోసం 200-300 డాలర్లు ఖర్చు అవుతుంది. ఈ వార్తవచ్చిన కొన్ని వారాల తరువాత, CEO పీట్ లావ్, వెనుక ఒక కెమెరా బంప్ కలిగిన ఒక మిస్టీరియస్ దివిజ్  ఉపయోగించినట్లు గుర్తించారు. అయితే ఈ డివైజ్ గురించి ఇప్పటివరకూ కూడా ఎటువంటి సమాచారం లేదు, కానీ  అది ఈ 5G ఎనేబుల్ కానుందా అనిపిస్తుంది.

6. మోటో G7

మోటరోలా ఫిబ్రవరి నెలలో బ్రెజిల్లో జరిగినున్న ఒక కార్యక్రమంలో Moto G7 సిరీస్ను విడుదల చేయనుంది. ఈ మోటో G7 ప్లస్ మరియు మోటో G7 పవర్ రెండు ఫోన్లు కూడా ఒక వాటర్ డ్రాప్  నోచ్ తో వస్తాయి,అలాగే లీక్ అయిన ప్రెస్ రెండర్స్ ప్రకారం చిత్రాలను పరిశీలిస్తే, ఈ ఫోన్  డ్యూయల్  కెమెరాలతో పాటుగా ఒక గ్లాసి వెనుక రూపాన్ని కలిగివున్నట్లు తెలియచేశాయి.

7. Moto P40

Moto P40 యొక్క ఫస్ట్ లుక్ OnLeaks ద్వారా వచ్చింది. ఈ పత్రికా రెండర్, ఈ ఫోనులో ఒక పంచ్ హోల్  డిజైన్ మరియు ఒక 48MP వెనుక కెమెరా మరియు Android One ధృవీకరణను కలిగివున్నట్లు ఆరోపిస్తోంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :