ఈవారం OTT లో రిలీజ్ కానున్న అప్ కమింగ్ సినిమాలు ఇవే.!

ఈవారం OTT లో రిలీజ్ కానున్న అప్ కమింగ్ సినిమాలు ఇవే.!
HIGHLIGHTS

ఈ వారం OTT లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి

'సీతారామం' తో పాటుగా మరికొన్ని సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి

హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'థోర్ లవ్ అండ్ థండర్' కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోంది

ఈ వారం OTT లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. సినిమా థియేటర్లలో మంచి కలక్షన్ రాబట్టిన రొమాంటిక్ డ్రామా సినిమా 'సీతారామం' తో పాటుగా మరికొన్ని సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఇదే వారం హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ 'థోర్ లవ్ అండ్ థండర్' కూడా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఆ లేటెస్ట్ సినిమాలు ఏమిటో చూసేద్దామా.

థోర్ లవ్ అండ్ థండర్

మార్వెల్ కామిక్స్ ఆధారంగా చిత్రించిన అమెరికన్ సూపర్ హీరో మూవీ 'థోర్ లవ్ అండ్ థండర్' OTT లో రిలీజ్ అవుతుంది. థోర్ ర్యాంగ్ రాక్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా సినిమా సెప్టెంబర్ 8 నుండి Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతుంది.

7 డేస్ 6 నైట్స్

M.S రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ మరియు రోహన్ హీరోలుగా రూపొందిన చిత్రం '7 డేస్ 6 నైట్స్'. నేటి యువత కొత్త తరం పోకడల మధ్య సాగే రొమాంటిక్ సినిమా. ఈ సినిమా జూన్ 24 న థియేటర్లలో రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న AHA లో రిలీజ్ అవుతుంది.

మహా

హన్సికా మోత్వానీ నటించిన లేటెస్ట్ క్రైం థ్రిల్లర్ సినిమా 'మహా' OTT లో రిలీజ్ అవుతోంది. జూలై 22 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు OTT బాట పట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ AHA లో సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమ్ అవుతుంది.

సీతారామం

హను రాఘవపూడి ప్రేమ కథా చిత్రం 'సీతారామం' కూడా ఈవారం OTT లో రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్, సుమంత్, మృణాల్ ఠాకూర్ మరియు రష్మిక మందాన నటించిన ఈ చిత్రం ఇటీవలే హిందీలో డబ్ చేసి రిలీజ్ చెయ్యబడింది మరియు హిందీ వెర్షన్ మంచి కలక్షన్ లను కూడా సాధిస్తోంది. అయితే, ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo