హోమ్ కేబుల్ ఆపరేటర్ విషయానికి వస్తే, హాత్వే అందరికి పరిచయమున్న పేరు కావచ్చు, కానీ ఇది బ్రాడ్బ్యాండ్ ప్రపంచంలో కూడా ఉనికిలో ఉంది. టెలికాం టాక్ ప్రకారం, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల విషయానికి వస్తే హాత్వేకి హైదరాబాద్ నగరం పెద్ద మార్కెట్. ఈ సంస్థ ప్రకటించిన నూతన బ్రాడ్బ్యాండ్ ప్రణాళిక 'లైఫ్ సెట్ హై' మంచి లాభాన్ని ఇచ్చే ప్రణాళికగా ఉంది. ఇది 349 రూపాయలకు వినియోగదారులకు అపరిమిత డౌన్లోడ్లను అది కూడా ఎటువంటి FUP పరిమిలేకుండా ఇస్తుంది. టెలికాం టాక్ ప్రకారం, ప్రస్తుతానికి ఈ 'లైఫ్ సెట్ హై' ప్లాన్ కేవలం హైదరాబాదులోమాత్రమే అందుబాటులో ఉంది.
హైదరాబాదులో, హత్వే మరొక 5 ప్లాన్లను కూడా అందిస్తుంది, అన్ని ప్లాన్లను కూడా FUP పరిమి లేకుండా అందిస్తోంది. ఇవి 25Mbps, 75Mbps, 100Mbps, 125Mbps మరియు 80Mbps తో అందిస్తోంది. ఈ 25Mbps ప్రణాళిక రూ .349 ధరతో ప్రారంభమవుతుంది, కానీ ఇది అర్ధ సంవత్సర చందాను తీసుకుంటే మాత్రమే, అది మీకు 2394 రూపాయలు ధరతో అందుతుంది మరియు వార్షిక ప్లాన్ 4500 రూపాయలకు అందుతుంది. ఈ వరుసక్రమంలో టాప్ స్పీడ్ 125Mbps యొక్క ప్లాన్ అర్ధ సంవత్సర చందా ధర రూ .3594 మరియు వార్షిక చందా ధర రూ. 6588 తో ఉంటుంది.
వినియోగదారుల కోసం రిలయన్స్ Jio Giga ఫైబర్ ను ప్రవేశపెట్టినప్పటి నుండి అన్ని బ్రాడ్బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు కూడా ఇంటర్నెట్ వేగాన్ని అందిచడంలో పోటీ పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ కూడా భారత్ ఫైబర్ అనే ప్రణాళికను కలిగి ఉంది. ఈ కొత్త సేవ కింద బిఎస్ఎన్ఎల్ రోజుకు 35GB ఇస్తోంది అదికూడా రోజుకు రూ.1.1ధరతో, ఆసక్తిగల వినియోగదారులు BSNL యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రణాళికను బుక్ చేసుకోవచ్చు.
జియో గీగా ఫైబర్ ప్రారంభించటానికి నిర్దిష్ట తేదీ లేదు, అయితే ఈ సేవలు దేశవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నాయి. Jio, ఎలాగ స్మార్ట్ ఫోన్ 4G డేటా మార్కెట్ ను షేక్ చేసిందో, అలాగే బ్రాడ్బ్యాండ్ కోసం కూడా పోటీ ధరలు అందించేలా భావిస్తున్నారు. అయితే, ఆలస్యం పరిగణనలోకి తీసుకుంటే, మనకు ఎప్పుడైనా ప్రారంభించటానికి Jio Giga ఫైబర్ సేవ ముందుకురావచ్చని ఆశించవచ్చు.