బడ్జెట్ ధరలో మ్యాగ్నెటిక్ వైర్లెస్ Power Bank ను లాంచ్ చేసిన యునిక్స్
మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ను యునిక్స్ సరికొత్తగా విడుదల చేసింది
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తీసుకు వచ్చినట్లు యునిక్స్ తెలిపింది
22.5W PD సపోర్ట్ తో చాలా వేగవంతమైన వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ అందిస్తుంది
ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ యాక్సెసరీస్ బ్రాండ్ యునిక్స్, కొత్త ప్రోడక్ట్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరలో మ్యాగ్నెటిక్ వైర్లెస్ Power Bank ను యునిక్స్ సరికొత్తగా విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్ ను తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తీసుకు వచ్చినట్లు యునిక్స్ తెలిపింది.
యునిక్స్ వైర్లెస్ Power Bank: ధర
UX-1533 మోడల్ నెంబర్ తో తీసుకు వచ్చిన ఈ కొత్త మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ను రూ. 2,399 ధరతో విడుదల చేసింది. ఈ పవర్ బ్యాంక్ కంపెనీ అధికార వెబ్సైట్ unixindia.in మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది. ఈ వైర్లెస్ పవర్ బ్యాంక్ బ్లాక్, వైట్ మరియు పర్పల్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
యునిక్స్ వైర్లెస్ Power Bank: ఫీచర్లు
యునిక్స్ లాంచ్ చేసిన ఈ UX-1533 మ్యాగ్నెటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ Qi-based వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది మల్టిపుల్ పోర్ట్ పవర్ బ్యాంక్ మరియు వైర్లెస్ టెక్నాలజీ కలిగి వుంది. ఇది 22W టూ వే వైర్ ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. ఇది 15W వైర్లెస్ మరియు 22.5W PD సపోర్ట్ తో చాలా వేగవంతమైన వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ అందిస్తుంది.
అలాగే, ఇది USB పోర్ట్ మరియు టైప్ C పోర్ట్ లతో కూడా వస్తుంది. టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు ఫాస్ట్ ఇన్ పుట్ తో ఈ పవర్ బ్యాంక్ 45 నిముషాల్లోనే 80% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. Lightning, Type-A లేదా Type-C మరియు మరిన్ని ఇతర కంపాటిబిలిటీ ఫీచర్లను కలిగి వుంది.
Also Read: Google: తెలుగుతో సహా 9 భాషల్లో Gemini AI App లాంచ్ చేసిన గూగుల్.!
ఈ యునిక్స్ మ్యాగ్నటిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ సురక్షితమైన ఛార్జింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం మల్టీ లేయర్ ప్రొటక్షన్ టెక్నాలజీని కలిగి ఉందని కూడా కంపెనీ తెలిపింది. ఈ కొత్త పవర్ బ్యాంక్ కేవలం 123 గ్రాముల బరువుతో చాలా తేలికగా మరియు సౌకర్యవంతమైన కాంపాక్ట్ డిజైన్ తో వుంది.