Norway బేస్డ్ ఇండియన్ టెలికాం మొబైల్ ఆపరేటర్, యూనినార్, నిన్న పేరు మార్చుకుంది. ఇక నుండి దీని కొత్త పేరు, Telenor. పేరుతో పాటు క్రింద టాగ్ లైన్ కూడా మారుస్తున్నట్లు కంపెని asia రీజియన్ telenor గ్రూప్ హెడ్, మార్టెన్ సార్బీ అన్నారు.
గతంలో కాల్ drops విషయంలో reimbursements కేవలం లోకల్ కాల్స్ కు ఇచ్చింది కంపెని, ఇప్పుడు std, isd కాల్స్ మాట్లాడినప్పుడు కూడా, కాల్ drops అయితే మీ కాల్ చార్జెస్ వెన్నక్కి వస్తాయి.
unitech వైర్లెస్ అనే జాయింట్ వెంచర్ తో కలిసి uninor గా ఇండియాలో బిజినెస్ మొదలపెట్టింది నార్వే బేస్డ్ కంపెని . గత సంవత్సరం unitech పూర్తిగా బిజినెస్ నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి telenor నార్వే కంపెని దీనిని లాభాల బాటలో నడిపించింది.
సో Telenor గ్రూప్ ఆపరేట్ చేస్తున్నయూనినర్ ఇప్పటివరకూ ఆంధ్రా, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఉత్తర ప్రదేశ్ లలో సర్వీసెస్ నడిపింది. ఇక మీదట కూడా నడపనుంది కాని యూనినార్ పేరు మీద కాదు, Telenor పేరు మీద.