ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో కొత్త ప్రచారం..విషయం తెలుసుకోండి.!

ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో కొత్త ప్రచారం..విషయం తెలుసుకోండి.!

మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో కొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు, అసలే ప్రజలు వారి ఆధార్ కార్డ్ వివరాలు లేదా అప్డేట్స్ గురించి బయపడుతుంటే, ఈ కొత్త ప్రచారం వారిని మరింత భయపెడుతోంది. అసలు విషయం ఏమిటంటే, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ను ఇతరులకు ఇవ్వడం ద్వారా మీ ఆధార్ తప్పుగా ఉపయోగించే లేదా మీ వివరాలను ఉపయోగించుకునే ప్రమాదం ఉన్న కారణంగా, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ను ఎవరికి ఇవ్వవద్దని UIDAI ఆదేశాలను జారీచేసినట్లు ఒక మెసేజ్ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో సాగుతున్న కొత్త ప్రచారం అసలు నిజమేమిటో తెలుసుకుందామా. 

మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో జరుగుతన్న కొత్త ప్రచారం పూర్తిగా అవస్థవమని UIDAI ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు అటువంటిది ఏమిలేదని ఇటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఆధార్ సర్క్యులర్ పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజీలో, ప్రజలు వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని ఎవరికి ఇవ్వవద్దని దాని వలన ప్రజల వివరాలు తప్పుగా ఉపయోగించబడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం విన్నవిస్తునట్లుగా చెప్పబడింది. వాస్తవానికి, ఈ మెసేజీ పూర్తిగా అబద్దమని UIDAI తెలిపింది. 

 

 

ఇది మాత్రమే కాదు, మాస్క్డ్ ఆధార్ ను వినియోగదారులు ఉపయోచాలని ప్రభుత్వం కోరుతున్నట్లుగా కూడా ఈ మెసేజీలో చెబుతున్నారు. అయితే, మీరు ఇటివంటి వాటి తప్పుడు ప్రచారం గురించి చింతించవలసిన పనిలేదని UIDAI తన ట్వీట్ తో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo