Aadhaar New Update: ఇంట్లో కూర్చొనే మీ ఆధార్ అడ్రెస్ అప్డేట్ చేసుకోండి.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

UIDAI ద్వారా ఆధార్ కార్డ్ గురించి ఒక కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది

మీ ఆధార్ కార్డ్ లో ఇంటి అడ్రెస్స్ ను చాలా సులభం అప్డేట్ చేసుకోవచ్చు

ఈ కొత్త సౌలభ్యం ఏమిటో వివరంగా తెలుసుకోండి

UIDAI ద్వారా ఆధార్ కార్డ్ గురించి ఒక కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా మీ ఆధార్ కార్డ్ లో ఇంటి అడ్రెస్స్ ను చాలా సులభం అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ముందు నుండే ఉంది కదా, అనుకుంటున్నారా? ఇది మరొక అప్డేట్. ఇప్పటి వరకూ ఆధార్ కార్డ్ లో అప్డేట్ కోసం సపోర్ట్ డాక్యుమెంట్ లను కూడా తప్పనిసరిగా జత చేయవలసి వచ్చేది. కానీ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ద్వారా యూజర్లు వారి అడ్రెస్ ను అప్డేట్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. UIDAI తీసుకొచ్చిన ఈ కొత్త సౌలభ్యం ఏమిటో వివరంగా తెలుసుకోండి. 

ఆధార్ కార్డ్ లో అడ్రెస్ అప్డేట్ లేదా చేంజ్ చేసుకోవాలని చూస్తున్న వారికోసం UIDAI ఈ కొత్త సౌలభ్యాన్ని అందించింది. ఆధార్ కార్డులో అప్డేట్ కోసం 'Head Of Family' ఆధారిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్ ను UIDAI కొత్తగా జత చేసింది. దీని ద్వారా ఇంటి పెద్ద అడ్రెస్స్ తో మిగిలిన వారు వారి అడ్రెస్స్ ను అప్డేట్ లేదా చేంజ్ చేసుకోవచ్చు. అయితే, ఎవరికైతే సపోర్ట్  డాక్యుమెంట్స్ వారి పేరు మీద అందుబాటులో లేవో, అటువంటి వారి కోసం ఈ కొత్త సౌలభ్యాన్ని అందించింది.

కుటుంభ పెద్ద ఆధార్ వివరాలతో పిల్లలు, భార్య/భర్త లేదా తల్లిదండ్రులు వంటి వారి అడ్రెస్ లను చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇళ్ళు మారినప్పుడు ఎప్పటికప్పుడు వారి అడ్రెస్ ను సరైన అప్డేట్ తో అప్డేట్ చేసుకునే వారికి ఇది చాలా సులభమైన పద్దతి. దీనికోసం కుటుంభ పెద్ద రిలేషన్ షిప్ డాక్యుమెంట్ అందిస్తే సరిపోతుంది. అంటే, మార్క్ షీట్, మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వంటి వాటిని సబ్మిట్ చేయవచ్చు. 

ఎలా అప్డేట్ చేసుకోవాలి?
1. ముందుగా myaadhaar.uidai.gov.in పేజ్ ని ఓపెన్ చెయ్యాలి

2. ఇక్కడ ఉన్న అప్షన్లలో 'Book An Appointment' లి వెళ్ళండి

3. ఇక్కడ my aadhaar లోకి వెళ్లి update address online ఎంచుకోండి

4. ఇక్కడ ఇంటి పెద్ద (HoF) ఆధార్ నంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి Submit చేయండి

5. ఇక్కడ మీరు HoF యొక్క వ్యాలీడ్ రిలేషన్షిప్ డాక్యుమెంట్ ను అప్ లోడ్ చెయ్యాలి

6. ఈ సర్వీస్ కోసం మీరు 50/- చెల్లించావలసి ఉంటుంది

7. పేమెంట్ పూర్తియిన తరువాత ఒక 'సర్వీస్ రిక్వెస్ట్ నంబర్' వస్తుంది 

అంతే, తరువాత మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వచ్చిన తరువాత, ఇంటి పెద్ద (HoF) కు  గురించి SMS పంపించబడుతుంది. ఎవరైతే, ఇంటి పెద్ద (HoF) వివరాలు అందిస్తారో, వారు 30 రోజుల్లో వారి 'My Aadhaar portal' లో లాగిన్ అయ్యి ఈ రిక్వెస్ట్ ను Approve చేస్తే సరిపోతుంది. అయితే, ఒకవేళ ఈ 30 రోజుల వ్యవధిలో ఇంటి పెద్ద (HoF) రిజెక్ట్ చేసినట్లయితే ఇది క్యాన్సిల్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :