ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్..కొత్త ఫీచర్ తెచ్చిన కేంద్రం..!

Updated on 09-May-2023
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ ఉన్న వారికి కేంద్రం మరొక గుడ్ న్యూస్ ప్రకటించింది

మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి వివరాలను మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు

ఈ యాప్ ద్వారా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు

ఆధార్ కార్డ్ ఉన్న వారికి కేంద్రం మరొక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆధార్ కార్డ్ తో లింక్ చేసిన ఈమెయిల్ మరియు రిజిస్టర్ మొబైల్ నంబర్ లను యూజర్లు చెక్ చేసుకోవడానికి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డ్ హోల్డర్స్ వారు వివరాలను చాలా చెక్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ ధర అధారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) పేర్కొంది. ఆధార్ తో గతంలో రిజిష్టర్ చేసిన చేసిన పాత మొబైల్ నంబర్లు లేదా మెయిల్ పైన OTP ల వెళుతున్నట్లు చేసిన ఆధార్ యూజర్ల వినతి మేరకు ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

UIDAI తీసుకొచ్చిన ఈ ఫీచర్ తో మీరు చాలా సులభంగా మీ ఆధార్ కార్డ్ తో రిజిష్టర్ చేసిన లేటెస్ట్ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడి వివరాలను మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను maadhaar యాప్ లో జత చేసింది మరియు ఈ యాప్ ద్వారా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. 

మొబైల్/మెయిల్ ఐడి వివరాలు ఎలా చెక్ చేయాలి?

ముందుగా, మీ ఫోన్ లో maAdhaar యాప్ కలిగి ఉండాలి.  ఒకవేళ యాప్ మీ ఫోన్ లో లేకుంటే డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ను మీ మొబైల్ నంబర్ తో వెరిఫై చేసి రిజిష్టర్ చేసుకోవాలి. ఇక ప్రోసెస్ లోకి వెళితే, యాప్ ను ఓపెన్ చేసి Verify Email/Mobile బాక్స్ పైన టీబీ నొక్కండి. ఇక్కడ మీకు Verify Mobile Number మరియు verify Email ID అని రెండు అప్షన్ లు కనిపిస్తాయి. 

ఇక్కడ మీరు మొబైల్ నంబర్ చెక్ చేసుకోవాలంటే మొబైల్ పైన లేదా మెయిల్ అడ్రెస్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇమెయిల్ ఐడి పైన టచ్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన అప్షన్ ను ఎంచుకోని ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ / మెయిల్ ఐడి లను ఎంటర్ చేసి క్రింద అందించిన క్యాప్చను ఎంటర్ చేసి Verify పైన నొక్కండి. వెంటనే, మీ వివరాలు అందించబడతాయి.

దేశవ్యాప్తంగా అందుకున్న పలు కంప్లైట్స్ కు సొల్యూషన్ గా ఈ కొత్త సౌలభ్యాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :