మీ వద్ద ఆధార్ కార్డ్ ఉందా, అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. ఆధార్ కార్డ్ హోల్డర్స్ నుండి అత్యధికంగా అందుకున్న వినతులను దృష్టిలో ఉంచుకొని ప్రజల వినియోగార్ధం కొత్త ఫీచర్ ను కేంద్రం తీసుకొచ్చింది. OTP నంబర్ ను గతంలో ఉపయోగించిన తమ పాత మొబైల్ నంబర్ / మెయిల్ ఐడి పైన అందుకుంటున్నట్లు అందుకున్న కంప్లైంట్స్ మరియు రిక్వెస్ట్ లను దృష్టులో ఉంచుకొని, UIDAI mAadhar లో కొత్త ట్యాబ్ ను జత చేసింది. దీని ద్వారా చాలా సింపుల్ మరియు వేగంగా ఆధార్ కార్డ్ అనుసంధాన వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ సీడింగ్ సమయంలో రిజిష్టర్ చేసిన రిజిష్టర్ మొబైల్/మెయిల్ ఐడి లను అనివార్య కారణాల వలన కొంత మంది అప్డేట్ లేదా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి వారిలో కొంత మంది ఆధార్ కార్డ్ హోల్డర్లు ముందుగా అందించిన పాత మొబైల్ నంబర్ / మెయిల్ ఐడి పైన OTP నంబర్లను పొందుతున్నట్లు తెలుస్తోంది. దీని విషయంగా కంప్లయింట్స్ అందుకున్న UIDAI, దీనికి సొల్యూషన్ ను అందించింది. దీనికోసం mAadhar లో కొత్తగా Verify Email / Mobile ట్యాబ్ బాక్స్ ను జత చేసింది.
mAadhar లో కొత్తగా జత చేసిన ఈ Verify Email / Mobile ట్యాబ్ ద్వారా చాలా సులభంగా మీ ప్రస్తుత రిజిష్టర్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
1. mAadhar ను ఓపెన్ చెయ్యాలి
2. Verify Email / Mobile ట్యాబ్ బాక్స్ పైన నొక్కండి
3. ఇక్కడ verify mobile లేదా verify Email ID అని అప్షన్ వస్తాయి
4. మీకు కావాల్సిన అప్షన్ ఎంచుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి
5. చివరిగా క్రింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి Verify పైన నొక్కండి
అంతే, మీ ఆధార్ తో రిజిష్టర్ చెయ్యబడిన మొబైల్ / మెయిల్ ఐడి వివరాలు చూడవచ్చు.