హైదరాబాద్ లో Yahiya Mohammad మరియు Ansari అనే ఇద్దరు యువకులు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ లలో ఐటమ్స్ ను కొని, వాటిని రిటర్న్ చేసి మోసాలకు పాల్పడ్డారు.
ఐటెం డెలివర్ చేయటానికి బాయ్ వస్తే ఇద్దరిలో ఒకరు డెలివర్ బాయ్ దగ్గర ఉండగా, మరొక వ్యక్తి ఐటెం తీసుకోని డెబిట్ కార్డ్ తెస్తా అని చెప్పి లోపాలకి వెళ్ళేవారు..
ఎవ్వరికీ తెలియకుండాబాక్స్ సీల్ తీసి దానిలోని ఐటెం ను బయటకు తీసేసి ఇసుకతో ఖాలీ డబ్బాను నింపి మరలా సీల్ వేసేవాడు. డెలివరి బాయ్ వద్దకు డెబిట్ కార్డ్ మరియు…
ఇసుక నింపిన బాక్స్ తో వచ్చి, డెబిట్ కార్డ్ ను స్వైప్ చేయటానికి ఇచ్చేవారు. అయితే కార్డ్ పనిచేయక, అదే కారణంతో కాష్ ఇవ్వకుండా ఐటెం ను రిటర్న్ చేస్తాము అని చెప్పి, డెలివరి చేయటానికి వచ్చిన బాయ్ కే ఐటెం తిరిగి ఇచ్చేవారు.
ఇలా 3 హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్, డిజిటల్ కెమేరా మరియు ఇతర ఎలెక్ట్రానిక్ గాడ్జెట్ లను సొంతం చేసుకున్నారు. విషయం పోలిసలుకు చేరటంతో వీల్లద్దరి గురించి మీరు చదువుతున్నారు.