తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు నుండి సర్వదర్శనం కోసం ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ప్రస్తుతానికి ఉచిత దర్శనం (సర్వదర్శనం), అకామిడేషన్ రూమ్స్ మరియు లడ్డు కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నట్లు కొత్త నివేదికలు వివరించాయి. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించడానికి తగిన కారణాలను మరియు లాభాలను కూడా TTD తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం ఉపయోగించడం ద్వారా వెంటవెంటనే ఉచిత దర్శన సేవల కోసం ప్రయత్నించే వారిని నిలువరిస్తుంది. తద్వారా, ఉచిత దర్శనమార్గం నుండి కూడా శ్రీవారి దర్శనం ప్రతిఒక్కరికి శీగ్రంగా అందేలా చూడగలుగుతుందని యోచిస్తోంది. ఇది సరైన మరియు సత్వరమైన మార్గంగా మనం చూడవచ్చు. ఎందుకంటే, ఫేస్ రికగ్నైజేషన్ అనేది పూర్తి ఖచ్చితత్వంతో ఉంటుంది కాబట్టి ఇది వీలవుతుంది.
అయితే, ఎన్ని సార్లు సర్వదర్శనం (ఉచిత దర్శనం) ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని కూడా TTD తెలిపింది. భక్తులు నెలకు ఒక్కసారి ఈ ఉచిత దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ ఫేస్ రికగ్నైజేషన్ పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే, సరైన భక్తులకే రూముల అలాట్మెంట్ మరియు మరిన్ని ఇతర సర్వీస్ లను జెన్యూన్ భక్తులకు అందేలా చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.